ఏంటి ప్రేమలు బ్యూటీ మమితా బైజు లవర్ ఫ్రెండ్ తో ప్రేమలో పడిందా.. ఇంతకీ మమిత బైజు ప్రేమలో పడ్డ ఆ వ్యక్తి ఎవరు.. నిజంగానే ఆయనతో ప్రేమలో ఉందా అనేది ఇప్పుడు చూద్దాం. మమిత బైజు అనే పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్..ప్రేమలు సినిమాతో వచ్చి గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి ఒకే ఒక మూవీ తో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారింది. అయితే అంతకుముందు ఎన్ని సినిమాల్లో నటించినా రాని ఈ ఒక్క సినిమాతో వచ్చింది. మలయాళం ప్రేమలు మూవీ పలు భాషల్లో కూడా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే అలాంటి మమిత బైజు తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఒక సెన్సేషనల్ పోస్ట్ పెట్టింది.అయితే ఆ పోస్టులో బర్త్డే చెబుతూనే ఐ లవ్ యు అంటూ చెప్పడంతో చాలామంది షాక్ అయిపోయారు. 

మరి ఇంతకీ బర్త్ డే ఎవరిదయ్యా అంటే..ప్రేమలు మూవీలో హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించిన నటుడు సంగీత్ ప్రతాప్ ది.. అయితే ఆ నటుడు బర్త్డే కావడంతో మమిత బైజు అతనితో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేయడంతో పాటు క్లోజ్ గా ఉండి టీ తాగుతూ, ఐస్ క్రీం తింటూ తిరిగిన వీడియోని షేర్ చేసింది. అయితే ఈ వీడియో కింద నా స్నేహితుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. నువ్వు నా లైఫ్ లో ఉన్న అందరిలో కెల్లా చాలా స్పెషల్ పర్సన్ వి..నా లైఫ్ లోకి సరైన టైంలో వచ్చిన అరుదైన రత్నానివి..ఐ లవ్ యు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ ఒక లవ్ ఎమోజిని షేర్ చేసింది..

 ప్రస్తుతం మమిత బైజు షేర్ చేసిన పోస్ట్ సామజిక మధ్యమాల్లో వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ అనే పెడుతుంది.కానీ ఐ లవ్ యు అని పెట్టడం వెనుక వేరే ఏదో ఉంది.. వీరిద్దరి మధ్య నిజంగానే ఏదో నడుస్తోంది. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు కావచ్చు అంటూ చాలామంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.ఇక మరికొంతమందేమో లేదు మమిత బైజుకి ఆయన స్నేహితుడు మాత్రమే అని కొట్టి పారేస్తున్నారు. మరి మమితా బైజు ప్రేమ వార్తల పై ఈ బ్యూటీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: