పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రాలలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఒకటి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండడంతో పాటుగా ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించడంతో కచ్చితంగా ఈ సినిమా మరొకసారి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంటుందని అభిమానులు అనుకున్నారు. ఇందులో హీరోయిన్గా శ్రీలీలని కూడా ఎంపిక చేయడం జరిగింది. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ గత కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగే అసలు జరగలేదట. డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఈ సినిమాని పక్కన పెట్టేసి ఇతర హీరోలతో సినిమాలు చేస్తూ ఉన్నారు.


దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆగిపోయిందనే విధంగా వార్తలు వినిపించాయి. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కు సంబంధించి డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక సీని లీక్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. లవ్ టుడే ప్రేమ్ ప్రదీప్ రంగనాథ్ హీరోగా నటిస్తున్న రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే సినిమా ఈనెల 21న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన హరీష్ శంకర్ ఒక సన్నివేశాన్ని లీక్ చేశారు.


పవన్ కళ్యాణ్ కు సంబంధించి కారు టాప్ మీద కూర్చొని ఉన్న సన్నివేశం తీశానని వెల్లడించారు.. గత కొద్ది రోజులుగా ఉస్తాద్ సినిమా షూటింగ్ ఆగిపోయిందని ప్రచారం కూడా ఎక్కువగా వినిపిస్తోంది. అందులో ఎలాంటి నిజము లేదు అన్నట్లుగా ఈ సన్నివేశాన్ని ఉదాహరణగా చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి తన కాన్వాయంలో బయలుదేరి కారు టాప్ పైకి ఎక్కి మరి ప్రయాణించిన సన్నివేశాన్ని ఇప్పుడు ఉస్తాద్  సినిమాలో పెట్టినట్లుగా తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా కూడా పొలిటికల్ పరంగా తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. మరి ఏ మెరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: