పవన్ కళ్యాణ్ వారాసుడుగా అకిరా నందన్ ఫిలిమ్ ఇండస్ట్రీ ఎంట్రీ గురించి పవన్ అభిమానులతో పాటు చాలామంది ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. అనేక సందర్భాలలో అకిరా తల్లి తన కొడుకుని హీరోగా చూడాలని ఉంది అంటూ అనేక సందర్భాలలో చెప్పడంతో ఖచ్చితంగా అకిరా హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని అనుకున్నారు అంతా.



అయితే లేటెస్ట్ గా అకిరా నందన్ తన తండ్రి పవన్ కళ్యాణ్ తో కలిసి దక్షిణభారత దేశంలోని ప్రముఖ ఆలయాలలో దర్శనం చేస్తూ కనిపించడం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అకిరా ఆధ్యాత్మిక దృష్టికి నిదర్శనంగా ఎటువంటి ఆర్భాటం లేకుండా తన తండ్రి పవన్ కళ్యాణ్ లానే సాంప్రదాయ దుస్తులు వేసుకూని కేరళ తమిళనాడు రాష్ట్రాలలోని అనేక ఆలయాలలో అకిరా కనిపించడంతో అనేకమంది పవన్ కళ్యాణ్ అభిమానులు అకిరా లేటెస్ట్ ఫోటోలను సోషల్ మెడియాలో ట్రెండింగ్ గా మార్చారు.



మరికొందరైతే అకిరా సినిమాలలోకి రాకుండా ఇలా ఆధ్యాత్మిక జీవితంలోనే కొనసాగుత్త సినిమాలను పట్టించుకోడా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా ఉండే వ్యక్తులు మాత్రం అకిరా కు సినిమాలలో నటించడం కంటే ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆశక్తి పేరుగుతోందా అంటూ మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.



అయితే మెగా కాంపౌండ్ కు సన్నిహితంగా ఉండే కొంతమంది ఇస్తున్న లీకుల ప్రకారం అకిరా కు సినిమాలలో నటన కంటే సంగీతం పట్ల ఆశక్తి బాగా పెరుగుతూ ఉండటంతో అతడు రానున్న రోజులలో సంకేత దర్శకుడుగా మారే ఆస్కారం ఉంది అంటూ మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. అయితే పవన్ వీరాభిమానులు మాత్రం తమ హీరో కొడుకు అకిరా మనసు మార్చుకుని హీరోగా ఎంట్రీ ఇస్తే చూడాలని ఉబలాట పడుతూ అకిరా ఎంట్రీ గురించి చాల ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే పూర్తిగా రాజకీయాలకే పరిమితం అయిపోతున్న పవన్ కళ్యాణ్ దృష్టి వరకు అభిమానుల ఆశలు చేరుతాయ లేదాఆ అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్..



మరింత సమాచారం తెలుసుకోండి: