టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ తన కెరీర్ లో ఎన్నో ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆయన ఎక్కువ శాతం విజయాలను కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీల ద్వారానే అందుకున్నాడు. ఇకపోతే వెంకటేష్ కెరియర్లో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీలలో సూర్యవంశం సినిమా ఒకటి. సూర్యవంశం సినిమాలో వెంకటేష్ రెండు పాత్రలలో నటించాడు. ఒక పాత్రలో తండ్రిగానూ , మరొక పాత్రలో కొడుకు గానూ కనిపించాడు. ఇక రెండు పాత్రలలో కూడా వెంకటేష్ తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.

ఇకపోతే ఈ మూవీలో తండ్రి పాత్రలో నటించిన వెంకటేష్ కు జోడిగా రాధిక నటించగా ... కొడుకు పాత్రలో నటించిన వెంకటేష్ కు మీనా జోడిగా నటించింది. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఎస్ ఏ రాజ్ కుమార్ సంగీతం అందించగా ... సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించారు. ఈ సినిమా 1998 వ సంవత్సరం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో రూపొందిన ఈ సినిమా ఆ సమయంలో ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంది. తండ్రి పాత్రలో , కొడుకు పాత్రలో నటించిన వెంకటేష్ రెండు పాత్రలలో కూడా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

దానితో ప్రేక్షకులకు ఈ సినిమా అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా విజయంలో ఎస్ ఏ రాజ్ కుమార్ అందించిన సంగీతం కూడా అత్యంత కీలక పాత్రను పోషించింది. ఇలా తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో రూపొందిన సూర్యవంశం సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా వెంకటేష్ కు మంచి గుర్తింపు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: