టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఇకపోతే పవన్ కళ్యాణ్వి వి సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే మూవీ తో హీరోగా కెరియర్ను మొదలు పెట్టాడు. మంచి అంచనాల నడమ విడుదల అయిన ఈ సినిమా పెద్ద విజయాన్ని అందుకోలేదు. ఈ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ "గోకులంలో సీత" అనే సినిమాలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.

చిరంజీవి గారి తమ్ముడు కావడంతో ఈయన సినిమాలపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకోవడం మొదలు పెట్టారు. కానీ ఈయన నటించిన మొదటి రెండు సినిమాలు మాత్రం పెద్ద స్థాయి విజయాలను అందుకోలేదు. అలాంటి సమయం లోనే పవన్ భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన సుస్వాగతం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో పవన్ కి జోడిగా దేవయాని నటించగా ... ఎస్ ఎ రాజ్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ కు తండ్రి పాత్రలో రఘువరన్ నటించాడు. ఈ సినిమాలో పవన్ , రఘువరన్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని చూపెట్టడంలో దర్శకుడు సూపర్ గా సక్సెస్ అయ్యాడు. అలాగే తండ్రి పాత్రలో రఘువరన్ కొడుకు పాత్రలో పవన్ తమ అద్భుతమైన నటనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఇక 1998 వ సంవత్సరం జనవరి 1 వ తేదీన మంచి అంచనాలు నడుమ విడుదల అయిన ఈ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. పవన్ కళ్యాణ్ కు ఈ సినిమా ద్వారా మొట్ట మొదటి బ్లాక్ బస్టర్ విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కింది. ఈ సినిమాతో పవన్ క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో ఒక్క సారిగా అమాంతం పెరిగిపోయింది. అలాగే ఈ మూవీ లోని పవన్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు కూడా దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: