ఇప్పటి జనరేషన్లో తల్లిదండ్రులు సంపాదిస్తే కూర్చొని తినే కొడుకులు కూతుర్లు ఉన్నారు కానీ తల్లిదండ్రులు చేసే అప్పులకు మేము బాధ్యులం కాదు అని వాళ్ళు చేసిన దానికి మాకేం అవసరం అని వదిలేసి,కనీసం తిండి కూడా పెట్టకుండా రోడ్డుమీద వదిలేసే జనాలు ఉన్నారు. కానీ ఇలాంటి జనరేషన్లు చనిపోయిన తండ్రి విలువలు కాపాడడం కోసం కోట్ల ఆస్తులు ఇచ్చేసి ఫ్యామిలీతో సహా బయటికి వచ్చిన కొడుకు కథే సన్నాఫ్ సత్యమూర్తి.త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా చేసిన మూవీ సన్నాఫ్ సత్యమూర్తి.. కోట్ల ఆస్తిపాస్తులతో పుట్టిన అల్లు అర్జున్ తండ్రి మరణంతో ఒంటరైపోతాడు. తండ్రి చేసిన అప్పులు తీర్చడం కోసం కోట్ల ఆస్తులు అన్నింటిని రాసి ఇచ్చేస్తాడు. ఈ క్రమంలోనే ఆస్తులన్నీ పోవడంతో ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి కూడా వదిలేసి వెళ్తుంది. అలా తన ఫ్యామిలీని తీసుకొని బయటికి వచ్చి ఫ్యామిలీని పోషించడానికి మ్యారేజ్ ఈవెంట్ మేనేజర్గా చేస్తారు. ఇక తర్వాత ఎంగేజ్మెంట్ అయినా అమ్మాయి పెళ్లికే ఈవెంట్ మేనేజర్ గా వెళ్తారు. అక్కడ జరిగిన సందర్భాలు అలాగే సమంతతో ప్రేమలో పడడం.. 

ప్రేమ విషయం తెలిసి సమంత తండ్రి రాజేంద్ర ప్రసాద్  మీ తండ్రి అందరికీ న్యాయం చేశాడు అని అంటున్నావు. నాకు మాత్రం అన్యాయమే చేశాడు. నాకు ఫ్లాట్ అమ్మి దాని ఒరిజినల్ కాగితాలు వేరే వాడి దగ్గర పెట్టాడు. ఇందులో నాకు అన్యాయం చేశాడు అంటాడు.కానీ తండ్రి విలువలు కాపాడుకోవడం కోసం కోట్ల ఆస్తులు వదిలేసిన అల్లు అర్జున్ ఇది ఒక లెక్కా నాకు అన్నట్టు సవాల్ చేసి నీకు నీ ఆస్తి పేపర్స్ చేతిలో పెడతాను అని దేవరాజు పాత్రలో నటించిన ఉపేంద్ర దగ్గరికి వెళ్తాడు. ఇక ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఉపేంద్ర చెల్లెలు నిత్య మీనన్ ని చావు బతుకుల నుండి కాపాడింది అల్లు అర్జున్ తండ్రే.ఆమెను కాపాడి అల్లు అర్జున్ తండ్రి మరణిస్తాడు. ఈ విషయం ఉపేంద్ర కు తెలియదు. అలా నిత్యమీనన్ తో ఎంగేజ్మెంట్ అవుతుంది. ఆ తర్వాత నిత్యమీనన్ తన మామని ప్రేమించిందనే విషయం తెలుసుకొని వారిద్దరిని కలపడానికి ఇంట్లో నుండి వెళ్లిపోమంటాడు.

 అదే సమయంలో అందరికీ తెలిసి ఇక ఆ ఫైటింగ్ లో అల్లు అర్జున్ ని చంపడానికి ఉపేంద్ర కత్తి ఎత్తిన సమయంలో సడన్గా అల్లు అర్జున్ తల్లి అక్కడికి వస్తుంది.దాంతో షాక్ అయిపోయిన ఉపేంద్ర అలాగే చూస్తారు. అప్పుడు అర్థమవుతుంది తన చెల్లెలు కోసం ప్రాణాలు విడిచిన వ్యక్తి కొడుకే అల్లు అర్జున్ అని. దాంతో పశ్చాత్తాపంతో తన దగ్గర ఉన్న ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తారు. చివరికి సమంత తండ్రి రాజేంద్రప్రసాద్ చేతిలో ఆ డాక్యుమెంట్స్ పెడతాడు. అలా తండ్రి విలువల కోసం కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ తండ్రి చేసిన అప్పులు తీర్చేసి చనిపోయిన కూడా తన తండ్రిని ఎవరు తిట్టుకోకూడదని తండ్రి విలువల కోసం ఎంతో కృషి చేసే ఓ కొడుకు కథే సన్నాఫ్ సత్యమూర్తి.. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సమంత నటించింది.నిత్యామీనన్,అదాశర్మల సెకండ్ హీరోయిన్స్ గా నటించారు. అలాగే సీనియర్ నటి స్నేహ ఉపేంద్ర భార్య పాత్రలో నటించింది

మరింత సమాచారం తెలుసుకోండి: