తమిళ హీరో విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ బిచ్చగాడు.. డైరెక్టర్ శశి దర్శకత్వంలో వచ్చిన పిచ్చైకారన్ అనే తమిళ సినిమా తెలుగులో బిచ్చగాడుగా డబ్ చేశారు.అలా తెలుగులో 2016 మే 13న విడుదలైన ఈ సినిమాకి భారీ రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంది. అలా కోటీశ్వరుడైన హీరో చావు బతుకులో ఉన్న తల్లి కోసం బిచ్చమెత్తుకునే పాత్రలో నటించడమే ఈ సినిమా కథాంశం.. విజయ్ ఆంటోని సరసన హీరోయిన్ గా సట్నా టైటస్ నటించింది. ఒక కోటీశ్వరుడు చావు బతుకుల్లో ఉన్న తన తల్లిని కాపాడుకోవడం కోసం ఎన్ని ట్రీట్మెంట్లు అందించినా కూడా ఫలితం ఉండదు. దాంతో స్వామీజీ విజయ్ ఆంటోనీ ని పక్కకు తీసుకెళ్లి నీ తల్లి బతకాలంటే 48 రోజులపాటు ఎవరికి తెలియకుండా బిచ్చగాడి రూపంలో నువ్వు బిచ్చమెత్తుకొని ప్రతిరోజు నువ్వు సంపాదించిన డబ్బుని ఆ దేవుడి హుండీలో వేయాలి. 

ఈ దీక్ష చేస్తే మీ తల్లి బతుకుతుంది అని చెబుతాడు. దాంతో తల్లి కోసం తన కోట్ల ఆస్తులు వదిలేసి తన ఆస్తి వ్యవహారాలన్నీ నమ్మకస్తుడైన స్నేహితుడికి అప్పజెప్పి బిచ్చగాడి అవతారం ఎత్తాడు. అలా బిచ్చగాడు అవతారం ఎత్తిన సమయంలోనే హీరోయిన్ పరిచయమవుతుంది.అలా వారి మధ్య ప్రేమ మొదలవుతుంది.అయితే బిచ్చగాడు అనే సంగతి మొదట హీరోయిన్ కు తెలియదు.ఆ తర్వాత తెలుస్తుంది.ఇక బిచ్చగాడుగా ఉన్న సమయంలోనే బిచ్చగాళ్ళలో ఉన్న ఓ అమ్మాయిని తీసుకువెళ్లి చేసే అక్రమాలు ఆ అమ్మాయి బయటకు చెప్పడంతో బయటపడతాయి. అయితే ఈ అక్రమాలు ఎదుర్కోవడానికి విజయ్ ఆంటోని ముందుకు రావడంతో ఆయనను చంపేయాలని చూస్తారు. ఇక అదే సమయంలో విజయ్ ఆంటోనీ బిచ్చగాడు కాదు ఆయన పెద్ద కోటీశ్వరుడు అని హీరోయిన్ కి తల్లి చెప్పడంతో ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. 

ఇక చివరి రోజు దీక్ష అయిపోతుంది అనగా రౌడిల చేతిలో తన్నులు తిని వారిని కొట్టి చివరికి తాను బిచ్చమెత్తి సంపాదించిన డబ్బుని గుడిలో వేయడానికి వెళ్లే సమయంలో పోలీస్ అడ్డుకుంటాడు  ఆ తర్వాత దీక్ష పూర్తవడంతో తన స్నేహితుడు విజయ్ ఆంటోనీ దగ్గరికి వస్తాడు. ఇక ఆయన్ని చూసిన పోలీస్ కి చెమటలు పడతాయి. చివరిగా 48 రోజులు దీక్ష చేసిన కూడా ఫలితం లేదు అని తల్లి చివరి స్టేజిలో ఉంది తులసి నీళ్ళు పోయాలి అని కబురు రావడంతో అక్కడికి వెళ్తాడు.ఇక తులసి నీళ్లు పోసి ఏడుస్తున్న సమయంలో తల్లిలో కదలిక వస్తుంది.అలా తల్లి బతుకుతుంది. చివరికి ఇన్ని రోజులు కలిసి ఉన్న బిచ్చగాళ్ళ అందరికీ తన ఫ్యాక్టరీలో జాబ్ ఇచ్చి మానవత్వం చాటుకుంటాడు.అలా తల్లి బతకడం కోసం కోట్ల ఆస్తులు వదిలేసి 48 రోజులు బిచ్చగాడి అవతారం ఎత్తి దీక్ష చేసిన పాత్రలో విజయ్ ఆంటోని అదరగొట్టారని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: