
లేటెస్ట్ గా ఇంటర్వ్యూలో కమెడియన్ ఎమ్ ఎస్ నారాయణ జీవితంలోకి చివరి క్షణాల గురించి మాట్లాతూ భావోద్వేగానికి లోనయ్యా డు. కమెడియన్ ఎమ్ ఎస్ నారాయణ చనిపోయి కొన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆయన చనిపోయినట్లుగా తనకు అనిపించదని అంటూ ఎమ్ ఎస్ నారాయణ పట్ల తనకున్న అభిమానాన్ని సాన్నిహిత్యాన్ని వివరించాడు.
తీవ్ర అనారోగ్యంతో ఎమ్ ఎస్ నారాయణ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నప్పుడు తాను హీరో గోపీచంద్ సినిమా షూటింగ్ లో ఉన్నానని ఆసమయంలో తనకు ఎమ్ ఎస్ కూతురు ఫోన్ చేసి ‘నాన్న మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నట్టుగా పేపర్ మీద రాసిచ్చారని’ చెప్పడంతో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి తాను హాస్పటల్ కు వెళ్ళిన సందర్భాన్ని గుర్తుకు చేసుకున్నాడు. తాను హాస్పటల్ కు చేరి ఎమ్ ఎస్ ఉండే రూమ్ లోకి వెళ్ళి మంచం దగ్గరికి చేరగానే ఎమ్ ఎస్ ఆత్మీయంగా తన చేయి పట్టుకుని ఏదో చెప్పాలని భావించారని అంటూ భావోద్వేగానికి బ్రహ్మానందం లోనయ్యాడు.
అయితే అప్పటికే ఆయన పరిస్థితి చేయి దాటిపోవడంతో డాక్టర్లు ఏమీ చెప్పలేని స్థితిలో ఉండటంతో తాను ఎక్కువసేపు ఎమ్ ఎస్ ను చూస్తూ హాస్పటల్ లో ఉండలేకపోయిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. అయితే ఎమ్ ఎస్ చనిపోకుండానే ఆయన చనిపోయారు అంటూ టీవి లలో వాళ్ళ రేటింగ్స్ కోసం వార్తలు రావడం తనకు చాల బాధను కలిగించిన విషయాన్ని వివరించాడు. ఆయన చనిపోయి చాలకాలం అయినప్పటికీ ఎమ్ ఎస్ నారాయణ గురించి బ్రహ్మానందం గుర్తుకు తెచ్చుకోవడం వారి సాన్నిహిత్యాన్ని సూచిస్తుంది.. .