
ఈ సినిమాలో అమ్మ సెంటిమెంట్ కు సంబంధించిన సీన్లు హైలెట్ గా నిలిచాయి. జయసుధ ఈ సినిమాలో అమ్మ పాత్రలో నటించగా జయసుధ తన నటనతో ప్రాణం పోశారు. అసిన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ఆమె కెరీర్ లో సైతం ఈ సినిమా ఒకింత బెస్ట్ సినిమాగా నిలిచిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అప్పట్లో అవార్డులు సైతం వచ్చాయి.
ఈ సినిమాకు చక్రి సంగీతం అందించగా మ్యూజిక్ సైతం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ నిర్మాతగా కూడా వ్యవహరించగా నిర్మాతగా మంచి లాభాలు దక్కాయి. పూరీ జగన్నాథ్ కెరీర్ ప్రస్తుతం ఇతర దర్శకులకు భిన్నంగా ఉంది. గోపీచంద్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తుండగా ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
రవితేజ కెరీర్ సైతం ప్రస్తుతం ఆశాజనకంగా లేదు. రవితేజ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో సినిమా రావాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మాస్ మహారాజ్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. రవితేజ పారితోషికం సైతం ఒకింత భారీ స్థాయిలో ఉంది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలకు, సీనియర్ డైరెక్టర్లకు ప్రస్తుతం గడ్డుకాలం అనే విధంగా పరిస్థితి ఉంది.