
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు - ఓజి సినిమాలతో తన అభిమానుల ముందుకు రానున్నారు. ఇక టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత ప్రశాంత నీల్ సినిమా ఉంటుంది. ఆ తర్వాత దేవర 2 సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తారు. టాలీవుడ్ లో ఈ ఇద్దరు పవర్ హౌస్ ల గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏమీ ఉండదు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరితో నటించాలని ఓ క్రేజీ టాలెంటెడ్ హీరోయిన్ తన కోరిక వ్యక్తం చేశారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు ? ప్రతిభావంతురాలు అయిన మృణాల్ ఠాకూర్. మృణాల్ ఠాకూర్ అందంతో పాటు చక్కని అవినయం కలిసి ఉన్న హీరోయిన్. ఆమె తాజాగా తనకు పవన్ కళ్యాణ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి హీరోయిన్గా నటించాలన్న కోరిక ఉన్నట్లు చెప్పింది. మరి మృణాల్ కు అంత సీన్ ఉందా ? అంటే కచ్చితంగా లేదని చెప్పాలి.
మృణాల్ ఇప్పటివరకు టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నాని రౌడీ హీరో విజయ్ దేవరకొండ అలాంటి హీరోలతో అవకాశాలు అందుకుంది. మరో మెట్టు ఎక్కాలంటే కచ్చితంగా పాన్ ఇండియా స్టార్ హీరోలు ఆయన ఎన్టీఆర్ .. పవన్ .. చరణ్ .. బన్నీ లాంటి హీరోల పక్కన ఆమెకు అవకాశాలు రావాలి. ఇలాంటి సమయంలో పవన్ ఎన్టీఆర్ సరసన ఆమె అవకాశాలు అందుకోవాలని ఆశపడుతుంది. అయితే పవన్ కళ్యాణ్ .. ఎన్టీఆర్ తరఫున మృణాల్ కు అవకాశం రావడం అంటే అంత సులువైన విషయం కాదు. ప్రస్తుతం వారు కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్నారు. చాలా బిగ్ ప్రాజెక్టులలో నటిస్తున్నారు. ఇలాంటి టైంలో మృణాల్ కు తమ సినిమాలలో ఎంతవరకు అవకాశం ఇస్తారు అన్నది సందేహమే. ప్రస్తుతానికి అడవిలో నటిస్తున్న ఈ బ్యూటీకి టాలీవుడ్ లో మరో అవకాశం లేదు. మరి ఎన్టీఆర్ పవన్ పక్కన నటించాలని ఆమె కోరిక తర్వాత అయినా తీరుతుందా అన్నది చూడాలి.