
అదేమిటంటే విడుదలకు ముందే తండేల్ సినిమా జాతర ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఒక మహిళ అభిమాని సాయి పల్లవి దగ్గరికి ఎలాగోలాగా చేరుకొని మరి ఆమెతో సెల్ఫీలు ఫోటోలు వంటివి దిగారు. ఆ తర్వాత హీరోయిన్ కి షేక్ హ్యాండ్ కూడా ఇస్తున్న సమయంలో ఆమె ఆనంద పడిపోయి సాయి పల్లవి చేతికి కూడా ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ తెగ వైరల్ గా మారుతున్నది. దీన్ని చూసిన నెటజన్స్ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అయితే సాయి పల్లవి కూడా ఆమె చేసిన పనికి కేవలం స్మైల్ తోని రియాక్ట్ అవుతూ ఆ అభిమానిని ఆనందపరిచింది..
కానీ ఈ వీడియోని మాత్రం సాయి పల్లవి అభిమానులు భాషా సినిమాలోని రజనీకాంత్ కి ఆయన అభిమానులు ఎలా ముద్దు పెట్టారో అలా సన్నివేశాలను లింక్అప్ చేస్తూ తెగ వైరల్ గా చేస్తున్నారు. మొత్తానికి సాయి పల్లవి రేంజ్ తండేల్ సినిమాతో మరొకసారి పెరిగిందని చెప్పవచ్చు. సాయి పల్లవి తదుపరి చిత్రాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. రాబోయే రోజుల్లో కూడా తన పాత్రకు మరింత ప్రాధాన్యత ఇచ్చేలా ఉండే కదలని ఎంచుకోవాలని డిసైడ్ అవుతోందట.