తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం అద్భుతమైన జోష్ కలిగిన నిర్మాణ సంస్థలలో మైత్రి సంస్థ ఒకటి. ఈ సంస్థ వారు మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన శ్రీమంతుడు అనే సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత వీరు తెరకెక్కించిన జనతా గ్యారేజ్ , రంగస్థలం సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలు సాధించడంతో ఈ నిర్మాణ సంస్థకు తెలుగులో అద్భుతమైన గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే ఈ బ్యానర్ వారు ఈ మధ్య కాలంలో తెలుగు తో పాటు ఇతర భాష సినిమాలను , పాన్ ఇండియా మూవీలను కూడా నిర్మిస్తూ వస్తున్నారు.

ఈ బ్యానర్ నుండి వచ్చిన పుష్ప పార్ట్ 1 , పుష్ప పార్ట్ 2 సినిమాలు పాన్ ఇండియా మూవీలుగా విడుదల అయ్యి అద్భుతమైన విజయాలను అందుకోవడంతో ఈ నిర్మాణ సంస్థకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇకపోతే ప్రస్తుతం కూడా ఈ నిర్మాణ సంస్థ చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. ఇక ఈ నిర్మాణ సంస్థ వారు ప్రస్తుతం వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఓ దర్శకుడితో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆ దర్శకుడు మరెవరో కాదు శ్రీను వైట్ల. కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగించిన శ్రీను వైట్ల ఈ మధ్య కాలంలో మాత్రం వరుస పెట్టి అపజాయలను ఎదుర్కొంటూ వస్తున్నాడు.

ఈయనకు ఆఖరుగా దూకుడు సినిమాతో మంచి విజయం దక్కింది. ఆ తర్వాత ఈయనకు ఆ రేంజ్ విజయం ఇప్పటి వరకు దక్కలేదు. ఆఖరుగా ఈయన విశ్వం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమా కూడా బోల్తా కొట్టింది. ఇకపోతే ప్రస్తుతం శ్రీను వైట్ల , మైత్రి సంస్థ మధ్య చర్చలు జరుగుతున్నట్లు , అన్ని కుదిరితే ఈ కాంబోలో సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: