తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన మాస్ ఈమేజ్ కరిగిన స్టార్ హీరోలలో చిరంజీవి , బాలకృష్ణ ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరూ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఇప్పటికీ కూడా ఫుల్ జోష్లో కెరీర్ను ముందుకు సాగిస్తున్నారు. ఇకపోతే ఒక దర్శకుడు బాలయ్య సినిమాల వల్ల చిరంజీవితోనే సినిమా వద్దన్నాడట. అసలు ఏం జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన దర్శకులలో బి.గోపాల్ ఒకరు. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం అశ్విని దత్ , చిరంజీవి హీరోగా గోపాల్ దర్శకత్వంలో ఓ మూవీ చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా గోపాల్ ని కలిసి చిరంజీవి గారు డేట్స్ ఇచ్చారు. చిన్ని కృష్ణ దగ్గర ఒక కథ ఉంది. అది నచ్చితే చిరంజీవి హీరోగా మన కాంబోలో సినిమా చేద్దాం అని అన్నాడట. దానితో గోపాల్ , చిన్న కృష్ణ దగ్గర ఉన్న కథను విన్నాడట. కథ మొత్తం విన్న తర్వాత చిరంజీవితో ఆ కథతో సినిమా చేయద్దు అనుకున్నాడట. ఆ తర్వాత ఒక రోజు పరుచూరి గోపాలకృష్ణ ఎందుకు నువ్వు చిన్ని కృష్ణ దగ్గర ఉన్న కథతో చిరంజీవితో సినిమా చేయను అన్నావు అని గోపాల్ ను అడిగాడట. దానితో గోపాల్ నేను ఇప్పటికే బాలకృష్ణ గారితో సమర సింహా రెడ్డి , నరసింహ నాయుడు అనే రెండు ఫ్యాక్షన్ సినిమాలు చేశాను.

అవి మంచి విజయాలను అందుకున్నాయి. కానీ చిరంజీవితో మెకానిక్ అల్లుడు సినిమా చేశాను. ఆ సినిమా ఫ్లాప్ అయింది. చిన్న కృష్ణ వినిపించిన కథ కూడా ప్యాక్షన్ నేపథ్యంలో ఉంది. మరోసారి ఫ్యాక్షన్ సినిమా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో అని వద్దన్నాను అని అన్నాడట. కానీ పరుచూరి గోపాలకృష్ణ కన్విన్స్ చేయడంతో చిన్ని కృష్ణ దగ్గర ఉన్న కథతో సినిమా చిరంజీవితో చేశాడట. ఆ సినిమానే ఇంద్ర. అది అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నట్లు పరుచూరి గోపాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: