- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

అతిపెద్ద డిజాస్టర్ సినిమా .. ఊహించిన సూపర్ హిట్ రెండు హీరోలని .. దర్శలని గందరగోళం లో పడేస్తూ ఉంటాయి. ఇది ఇప్పుడు సీనియర్ హీరో ఫ్యాక్టరీ వెంకటేష్ కు నూటికి నూరు శాతం వర్తిస్తుంది. టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి వ‌చ్చిన సంక్రాంతికి వస్తున్నాం వెంకీ కెరీర్ లో ఊహించని విజయం. అప్పటివరకు వెంకటేష్ సినిమా 50 కోట్లు దాటిన దాఖలాలు లేవు. అలాంటిది ఈ సినిమా ఏకంగా 300 కోట్ల క్లబ్లో చేరింది. ఇది ఎవరు ఊహించిన విజయం .. దీంతో ఇప్పుడు వెంకీ డైల మాలో పడిపోయారు. ఈ సినిమా తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలి ఎలాంటి కథలు ఎంచుకోవాలి ? అన్న సందిగ్ధం లో వెంకీ పడిపోయారట. సంక్రాంతి వస్తున్నాం సినిమా రిలీజ్ కి ముందు వెంకటేష్ రెండు కథ‌లని ఓకే చేశారు. అందులో సామాజ‌వ‌ర‌గ‌మ‌ణ‌ రచయిత చెప్పిన లైన్ ఒకటి ఉంది. ఈ కథ పట్టాలు ఎక్కటమే అనుకున్నారు .. కానీ ఇప్పుడు వెంకీ డ్రాప్ అయిపోయారని సమాచారం. ఇక వెంకి అట్లూరి కూడా వెంకటేష్ కే ఓ కథ చెప్పగా ఇప్పుడు దాన్ని ఆయన పక్కన పెట్టేశారు అంటున్నారు.


ఇక సురేందర్ రెడ్డి వెంకటేష్ కోసం ఒక కథ రెడీ చేస్తున్నారు. అది యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ .. అయితే ఇప్పుడు దానిని కూడా వెంకీ లైట్ తీసుకున్నారని తెలుస్తోంది. కొత్త దర్శ‌కుల తో సినిమాలుకు వెంకి నో చెబుతున్నారట. కాస్త స్టార్ డం ఉన్న దర్శకులు కావాలని వెంకటేష్ భావిస్తున్నారు. యాక్షన్ కథ‌లని వెంకి ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టి ఎంటర్టైర్లపై దృష్టి పెట్టారని సమాచారం. వెంకటేష్ సినిమా అంటే అన్న సురేష్ బాబు ఇన్వాల్వ్మెంట్ తప్పనిసరి.. కానీ ఆయన రెండు మూడు సినిమాలు పట్టించుకోలేదు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మళ్లీ ఇప్పుడు సురేష్ బాబు తన తమ్ముడు వెంకటేష్ సినిమాలకు సంబంధించిన బాధ్యతలు పగ్గాలు తన చేతుల్లోకి తీసుకుంటున్నారని .. ఇప్పుడు వెంకటేష్ సినిమా కథలను మొత్తం ఆయనే వింటున్నారని తెలుస్తోంది. ఇక 2027 సంక్రాంతికి కూడా వెంకటేష్ - అనిల్ రావిపూడితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: