తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయం లోనే అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకొని స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్న వారిలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత చందమామ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మగధీర సినిమాతో ఏకంగా ఇండస్ట్రీ హిట్ ను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది.

ఆ తర్వాత కూడా ఈమె ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోకుండా అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగించింది. ఇకపోతే ఎన్నో సంవత్సరాల పాటు ఎన్నో కమర్షియల్ సినిమాలలో నటించి తన అందాలతో , నటలతో ప్రేక్షకులను కట్టి పడేసిన కాజల్ అగర్వాల్ కు లేడి ఓరియెంటెడ్ సినిమాల ద్వారా మాత్రం ఇప్పటి వరకు అద్భుతమైన విజయం దక్కలేదు. తనతో పాటు కెరియర్ను మొదలు పెట్టి స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్న ఎంతో మంది ఈ మధ్య కాలంలో కమర్షియల్ సినిమాలలో కంటే కూడా తమ పాత్రకు ప్రాధాన్యత ఉన్న లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ మంచి విజయాలను అందుకుంటు ఫుల్ జోష్ లో ముందుకు దూసుకుపోతున్నారు.

అదే బాటలో కాజల్ కూడా ఈ మధ్య కాలంలో కమర్షియల్ సినిమాలను తగ్గించి లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తున్న కూడా కాజల్ కి లేడీ ఓరియంటెడ్ సినిమాల ద్వారా మంచి విజయాలు మాత్రం దక్కడం లేదు. మరి ఈ ముద్దు గుమ్మకు లేడి ఓరియంటెడ్ సినిమా ద్వారా మంచి విజయం ఎప్పుడు దక్కుతుందో చూడాలి. కాజల్ కొంత కాలం క్రితం సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: