
- 2010 లో గోలీమార్ సినిమా బిలో యావరేజ్
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .
టాలీవుడ్ డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దాదాపు 6 వరుస డిజాస్టర్ సినిమాల తర్వాత హీరో రామ్ హీరోగా తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ కొట్టడంతో ఫామ్ లోకి వచ్చారు. ఎట్టకేలకు ఒక్క సినిమా హిట్టు కొట్టి పూరి ఫామ్ లోకి వచ్చాడో లేదో వెంటనే విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించిన భారీ ఇండియా సినిమా లైగర్ అతిపెద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత రామ్ తో ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ సినిమా తెరకెక్కించారు. ఇది కూడా పెద్ద డిజాస్టర్ అయింది. రెండు అతిపెద్ద వరుస డిజాస్టర్ సినిమాల తర్వాత పూరి ఎట్టకేలకు తన కొత్త సినిమా కోసం రెడీ అయినట్టు తెలుస్తోంది. అసలే వరుస ప్లాపులతో ఇబ్బందుల్లో ఉన్న హీరో గోపీచంద్ కు వినిపించినట్టు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ చెప్పిన కథ ను కొన్ని మార్పులు .. చేర్పుల తో గోపీచంద్ కూడా ఓకే చెప్పాడని అంటున్నారు.
త్వరలో నే ఈ సినిమా పై అధికారిక ప్రకటన రానుంది అని తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో 2010లో వచ్చిన గోలీమార్ బాక్సాఫీస్ దగ్గర బిలో యావరేజ్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. నిజానికి పూరి జగన్నాథ్ - బాలయ్య కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటూ బాగా ప్రచారం జరిగితే పూరీకి అవకాశం ఇస్తారా అన్నది ? సందేహమే ఎట్టకేలకు పూరీ - గోపీచంద్ కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటూ టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాతో అయినా ఇద్దరు కలిసి ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.