తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన స్టార్ ఈమేజ్ కలిగిన హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. తారక్ ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగించడం మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా మంచి ఈమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇకపోతే ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించిన తారక్ తన కెరియర్ లో ఎన్నో సినిమాలను వదులుకున్నాడు. అలా ఆయన వదిలేసిన సినిమాలలో కొన్ని సినిమాలు అద్భుతమైన విజయాలను కూడా అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే ఆయన వదిలేసిన ఓ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో ఆ సినిమాను వదిలేసినందుకు చాలా బాధపడుతున్నాను అని ఆయన స్వయంగా చెప్పుకొచ్చాడు. ఆ సినిమా ఏది అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం మాస్ మహారాజా రవితేజ హీరోగా మీరా జాస్మిన్ హీరోయిన్గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో భద్ర అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే బోయపాటి శ్రీను మొదటగా ఈ సినిమాలో రవితేజను కాకుండా తారక్ ను హీరోగా అనుకొని ఆయనకు కథను కూడా వివరించాడట. కానీ తారక్ ఆ సమయంలో ఈ సినిమా కథను రిజెక్ట్ చేశాడట. ఇక ఒకానొక సినిమా ఈవెంట్లో భాగంగా తారక్ మాట్లాడుతూ ... బోయపాటి శ్రీను చెప్పిన భద్ర సినిమా కథను రిజెక్ట్ చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే తారక్ , బోయపాటి కాంబోలో దమ్ము అనే సినిమా రూపొందింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: