- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నందమూరి నట‌సింహ బాలకృష్ణ తాజాగా సంక్రాంతి డాకూ మహారాజ్‌ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ సినిమా 180 కోట్ల వసూళ్లు రాబట్టి బాలయ్య కెరీర్ లోని అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డుల్లో నిలిచింది. డాకూ మహారాజ్ సూపర్ డూపర్ హిట్ తర్వాత బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 తాండవం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అఖండ ఎలాంటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీంతో ఇప్పుడు అఖండ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న అఖండ 2 తాండవం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్లో బాలయ్య నటిస్తున్న అఘోర పాత్ర పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. సినిమా మొత్తానికి ఈ సన్నివేశాలు మెయిన్ హైలెట్గా నిలుస్తాయని తెలుస్తోంది చాలా అద్భుతంగా ఉంటుందట.


పలు కీలక పాత్రలలో ఇతర భాషల నటినటులను ఈ సినిమాలో తీసుకుంటున్నారు. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బిఎన్ఆర్ పై రామ్ ఆచంట - గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ . థ‌మ‌న్‌ సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను - బాలయ్య కాంబినేషన్లో హ్యాట్రిక్ విజయాలు నమోదు అయ్యాయి. దీంతో అఖండ టు తాండవం సినిమాపై అంచనాలు రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. బాల‌య్య బోయ‌పాటి అంటేనే ముందు గా మ‌న‌కు సింహా సినిమా గుర్తుకు వ‌స్తుంది. ఆ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబోలో లెజెండ్ వ‌చ్చి బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఆ త‌ర్వాత ముచ్చ‌ట‌గా మూడో సారి అఖండ సినిమా వ‌చ్చి సూప‌ర్ హిట్ అయ్యింది. ఇక అఖండ 2 సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 28న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: