- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నందమూరి నట‌సింహ బాలకృష్ణ ఎనర్జీ గురించి ఆయన స్టామినా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ వయసులో కూడా బాలయ్య చాలా ఎనర్జిటిక్ తో దూసుకుపోతూ ఉంటారు. అటు వెండి తెర మీద .. ఇటు బుల్లితెర మీద అటు రాజకీయాలలో బాలయ్య షేక్ చేస్తున్నారు. తెరమీద మాస్ హీరోగా కనిపించే బాలయ్య ఆఫ్ స్క్రీన్ లో కూడా ఫుల్ ఎనర్జీతో ఉంటారు. తెరమీద అయినా క్యారెక్ట‌రై జేషన్ లిమిటేషన్స్ ఉంటాయేమో కానీ ఆఫ్ స్క్రీన్ మీద అది ఉండదు. అందుకే బాలకృష్ణకు బయట ఎనర్జీ డబుల్ కనిపిస్తూ ఉంటుంది. శనివారం రాత్రి బాలయ్య తనలోని జోష్ ప్రదర్శిస్తూ ఫ్యాన్స్ కి మంచి పీస్ట్ అందించారు. విజయవాడలో జరిగిన తమన్ యుఫోరియా మ్యూజికల్ నైట్ లో భాగంగా బాల‌య్య స్టేజి ఎక్కి దడ దడ లాడించేశారు.


ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌కు వ‌చ్చిన జ‌నాల తో పాటు నందమూరి అభిమానులు బాగా ఎంజాయ్ చేశారని చెప్పవచ్చు. ఈవెంట్ సక్సెస్ చేయడంలో బాలయ్య తన వంతుగా సాంగ్ పడటమే కాదు ఫ్యాన్స్ కు పూన‌కాలు తెప్పించేలా డ్రమ్స్ వాయించారు. బాలయ్య స్టేజ్ ఎక్కిన దగ్గర్నుంచి స్టేజ్ దిగే వరకు ఒకటే సందడి చేశారు. బాలయ్య ఎనర్జీ చూసిన చాలామంది అభిమానులు అవాక్కయ్యారు. ఈవెంట్ ఏదైనా బాలకృష్ణ ఉన్నాడు అంటే అదిరిపోవాల్సిందే .. అనే రేంజ్ లో ఆయన జోరు కొనసాగించారు. అలాగే ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ - బాలకృష్ణ ఒకే ప్రేమలో కనిపించి సినీ లవర్స్‌ను మంచి ఖుషీ చేశారు. ఇక బాల‌య్య ప్ర‌స్తుతం అఖండ 2 తాండ‌వం లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: