
ఈ క్రమంలోనే కొన్ని జిమ్మిక్కులు ఫ్యాన్స్ కి సైతం ఇబ్బంది కలిగించేలా కనిపిస్తూ ఉంటాయి. అలా గేమ్ ఛేంజర్ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల కాక సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ ప్రైమ్ వీడియో వారు ఒక వీడియో క్లిప్ షేర్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియో అది కామెడీగా చేసినట్లుగా రామ్ చరణ్ అభిమానులు భావించి అమెజాన్ ప్రైమ్ ఓటిటి మీద ఫైర్ అవుతున్నారు. రామ్ చరణ్ తన టీమ్లో అవినీతిపరులైన వారందరిని తీసివేసి నిజాయితీ గల ఉద్యోగులను తీసుకుంటూ ఉంటారు.. ఆ సమయంలో వారు అలా గాలిలో లేచిపోయి వేరే వాళ్ళు ఇలా వస్తూ ఉండడాన్ని.. ప్రైమ్ వీడియో వారు.. ఉయ్ అనే సౌండ్ తో యాడ్ చేసి వీటిని కామెడీగా చూపించారు.
ఈ సన్నివేశాలను సినిమాలలో సీరియస్ గా చూపించిన దీనిని జనాలకు ఆకర్షణీయంగా ఉంటుందని ప్రైమ్ వారు సోషల్ మీడియా ద్వారా ఇలా కామెడీ చేయించారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇవి చీఫ్ పబ్లిసిటీ ప్రమోషన్స్ అంటూ అమెజాన్ ప్రైమ్ మీద మెగా అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు. థియేటర్లో చూడని వారు అమెజాన్ ప్రైమ్ లో చూస్తూ ఉండడంతో గేమ్ ఛేంజర్ సినిమా బాగానే ఓటీటీ లో సత్తా చాటుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.