
ఉదాహరణకు కాజల్ ను తీసుకోండి మొన్నటి వరకు స్టార్ ఇమేజ్ ఎంజాయ్ చేసింది .. దాదాపు దశాబ్దం పాటు ఈమె హవా గట్టిగా నడిచింది .. పెళ్లి తర్వాత కూడా ఈమెకు అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు .. కానీ కాజల్ మెల్లమెల్లగా ఫీడ్ అవుట్ అయిపోయింది .. ఈమెకు పెద్దపెద్ద సినిమాలో అవకాశాలు రావడం లేదు. మరో హీరోయిన్ సమంత పరిస్థితి కూడా ఇదే .. ఈమెకు అవకాశాలు భారీగా తెగిపోతున్నాయి .. ఆమె అవకాశాలు తగ్గించుకుంటుందా లేక. ఈమెకు అవకాశాలు రావడం లేదా అనే చర్చను పక్కనపడితే సమంత వెండితెరపై కనిపించి చాలా సంవత్సరాలు అవుతుంది .. ప్రస్తుతం ఈమె వెబ్ సిరీస్ లు మాత్రమే నటిస్తుంది.
అలాగే శృతిహాసన్ కూడా 40 ఏళ్ల దగ్గరకు వచ్చేసింది .. త్రిష ఇప్పటికే 40 దాటేసింది అనుష్క కూడా 40 దాటి మూడు సంవత్సరాలవుతుంది .. తమన్న 35 క్రాస్ చేసింది .. ఇంకా పెళ్లి చేసుకోకపోవడం వల్ల వీళ్ళకి ఎంతో కొంత క్రేజ్ ఉందని అనిపిస్తుంది. ఇలా పెళ్లి తర్వాత కూడా క్రేజ్ కంటిన్యూ చేసే అవకాశం సౌత్ లో నయనతార లాంటి అతి కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే ఈ ఛాన్స్ దక్కుతుంది. అయితే ఈ విషయంలో టాలీవుడ్ చాలా వెనకబడి ఉంది .. నిహారిక , లావణ్య త్రిపాఠి , ప్రియమణి , వరలక్ష్మి శరత్ కుమార్ లాంటి పెళ్లైన హీరోయిన్లు సినిమాలు చేస్తున్నారంటే .. ఈ హీరోయిన్లు పెద్ద సినిమాలకు ఎప్పుడో దూరమయ్యారని భావన.