చిత్ర పరిశ్ర‌మ‌లో ఎన్నో రకాల వార్తలు వస్తూ ఉంటాయి .. అయితే ఇప్పుడు ఓ హీరో గురించి ఎవరు ఊహించిన వార్త బయటకు వచ్చింది .. అతను ఓ యంగ్ హీరో.. రెండు మూడు మంచి విజయాలు కూడా అందుకున్నాడు .. అన్నిటికీ మించి కథ , స్క్రీన్ ప్లే , డైరెక్షన్ ఇలా చాలా విషయాల్లో దగ్గరుండి చొరవ తీసుకుంటాడనే పేరు కూడా ఉంది .. ప్రస్తుతానికి అతని హవా గట్టిగా నడుస్తుంది .. దీంతో ఆ హీరో ఆడింది ఆట .. ఆడింది పాటగా అంతా నడుస్తుంది.

ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నా ఈ హీరో ఆ రెండు సినిమాలు నుంచి ఇద్దరు హీరోయిన్ ల‌ను పక్కకు తప్పించేశాడు .. తనకు నచ్చిన మరో ఇద్దరిని అందులో పెట్టుకున్నారు .. అడిగితే పర్ఫామెన్స్ తనకు మ్యాచ్ కావడం లేదంటున్నాడు .. దీంతో నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చి పడ్డాయి. అప్పటివరకు ఆ హీరోయిన్లతో తీసిన ఫుటేజ్ మొత్తం డిలీట్ చేయాల్సి వచ్చింది .. దీనికి తోడు ఓ స్టార్ హీరోయిన్ తప్పించాల్సి రావటంతో ఆమెకు కొంత అమౌంట్ ఇచ్చి మరి సెటిల్ చేయాల్సి వచ్చింది .. ఇలా  ఇంత ఖర్చు కు హీరోనే కారణం .. ఇది చాలట్లేదు అన్నట్టు ఇప్పుడు హీరో తన క్రియేటివిటీ మరీ చూపిస్తున్నాడు .. ఇప్పటికే షూటింగ్ అయిన సన్నివేశాన్ని మళ్లీ రీ షూట్ చేస్తున్నాడు ..


వేసిన సెట్లు షూటింగ్ తర్వాత తీయొద్దంటున్నాడు .. మరోవైపు కొత్త సీట్స్ వేయమంటున్నాడు .. అడిగితే తన స్టైల్ ఆఫ్ మేకింగ్ ఇదే అని సోది చెబుతున్నాడు. నిజానికి ఇతడు స్టైల్ ఇదే .. కాకపోతే మార్కెట్ లేనప్పుడు ఈ పద్ధతి నడిచింది ఖర్చు కాస్త పెరిగిన ఆ నిర్మాతలు తట్టుకున్నారు .. కానీ ఇప్పుడు హీరో మార్కెట్ పెరిగిపోయింది .. దానికి తగ్గట్టే బడ్జెట్ కూడా భారీగా పెరిగాయి .. ఇప్పుడు కూడా పాత స్టైల్ లోనే తీసి చూసి మళ్లీ చేస్తానంటే ఎలా ఈ విషయం ఆ హీరోకు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. దీంతో ఆ హీరో అలిగితే మళ్లీ మరో ఖర్చు అన్నట్టు నిర్మాతలు మూసుకొని కూర్చుంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: