టాలీవుడ్ టాప్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి 1,2, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ఇండియన్ సినిమాను గ్లోబల్ రేంజ్‍కు తీసుకెళ్లారు. ప్రపంచమంతా తెలుగుతో పాటు భారత సినీ ఇండస్ట్రీ వైపు తిరిగిచూసేలా చేశారు.ఇదిలావుండగా బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రముఖ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్ జోహార్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు. దాదాపు అందరి స్టార్ హీరోలతో సినిమాలు తీసిన ఈయన ఎక్కువగా స్టార్ కిడ్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉంటాడు. ఇకపోతే కరణ్ జోహార్ సినిమాల విషయంలో ఎంత యాక్టివ్ గా ఉంటారో బయట కూడా అంతే యాక్టివ్ గా ఉంటారు. అందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక విషయంపై చర్చించి వార్తల్లో నిలుస్తూ ఉండే ఈయన తాజాగా ఒక సినిమా హిట్ అవ్వడం గురించి అలాగే రాజమౌళి గురించి, డైరెక్టర్స్ పై ప్రజలు పెట్టుకున్న నమ్మకాల గురించి కూడా మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచారు.అదేమిటంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కరణ్ జోహార్ మాట్లాడుతూ మనం తీసిన సినిమాపై మనకు నమ్మకం ఉంటే, ప్రేక్షకులు ఆ సినిమాలో లాజిక్ గురించి పట్టించుకోరు. ఉదాహరణకు మనం రాజమౌళి సినిమాలు తీసుకుంటే ఆయన చిత్రాలలో లాజిక్ గురించి ఎప్పుడు ప్రేక్షకులు మాట్లాడలేదు. దానికి కారణం వారికి ఆయన కథ పైన ఉన్న నమ్మకమే. ఎలాంటి సన్నివేశాలనైనా సరే ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించగలడు.

ఇక ఆర్ఆర్ఆర్ చిత్రం మాత్రమే కాకుండా యానిమల్, గదర్ వంటి చిత్రాలకు కూడా ఇదే అంశం వర్తిస్తుంది. ఈ సినిమాలు హిట్ అయ్యాయి అంటే ఆయా దర్శకులపై ప్రజలలో ఉన్న నమ్మకమే అని చెప్పవచ్చు. ఇక గదర్ 2 లో హీరో 1000 మందిని కొడుతున్నట్లు చూపించారు. మరి అది సాధ్యమా? కాదా?అని ఎవరు కూడా చూడలేదు. కారణం దర్శకుల పైన ఉన్న నమ్మకమే. ఇక సన్నీ దేవోల్ ఏదైనా చేయగలడని దర్శకుడు అనిల్ శర్మ  నమ్మారు కాబట్టే దానిని ఆయన తెరపై చూపించారు. ఇక దీనినే అటు ప్రేక్షకులు కూడా నమ్మారు. ఫలితంగా ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అందుకే నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే సినిమా విజయం అనేది పూర్తిగా నమ్మకం పైనే ఆధారపడి ఉంటుంది. లాజిక్ గురించి ఆలోచించినా ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి సినిమాను ఎంజాయ్ చేస్తూ చూడాలి” అంటూ కరణ్ జోహార్ తెలిపారు. ఇక ప్రస్తుతం కరణ్ జోహార్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.ఇదిలావుండగా గతేడాది ఐదు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన కరణ్‌ ప్రస్తుతం 'ధడక్‌ 2'తో బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: