బ్రహ్మానందం ఈ పేరుకు పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఆయన చేసే కామెడీ కంటే ఆయన పేరు చెబితేనే ముఖంలో నవ్వు విరబూస్తుంది.మెగాస్టార్ చిరంజీవి  ప్రోత్సాహంతోనే అవకాశాన్ని అందుకొని భారీ పాపులారిటీ అందుకున్న ఈయన సినీ కెరియర్ లోనే 1200కు పైగా చిత్రాలలో కమెడియన్ గా నటించి, గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నారు. ఇకపోతే బ్రహ్మానందం తన కామెడీతో నవ్వించడమే కాదు తన నటనతో ఏడిపించగలరు కూడా దీనికి ఉదాహరణ ‘బాబాయ్ హోటల్’ఆ తరువాత ఈ మధ్యకాలంలో వచ్చిన ‘రంగమార్తాండ’ చిత్రాలు ఆయనలోని మరో నటుడిని నిద్రలేపాయి. అయితే ఇప్పుడు బ్రహ్మానందం తన కొడుకుతో కలిసిన నటించిన ‘బ్రహ్మ ఆనందం’లో ఉన్న మరో యాంగిల్ ను చూసి అభిమానులు సైతం కంటతడి పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన నటనకి ఇచ్చే ప్రాముఖ్యతను చూసి హాస్యబ్రహ్మ అందుకే అవ్వలేదు. ఆయన లెజెండ్రీ యాక్టర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇకపోతే చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం తన కొడుకు గౌతమ్ రాజా తో కలిసి ‘బ్రహ్మ ఆనందం’ అనే సినిమా చేశారు. ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బ్రహ్మానందం, అలాగే గౌతమ్, వెన్నలకిషోర్ తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని చూసిన ప్రేక్షకులు అంటున్నారు. కామెడీ సీన్స్ లోనే కాదు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించి మెప్పించారు అని కొనియాడుతున్నారు.

ఇక ఈ సినిమా  సక్సెస్ అవ్వడంతో తాజాగా సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు.ఇక ప్రేక్షకులు మాత్రమే కాదు సినీ సెలబ్రెటీలు కూడా ఈ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కూడా బ్రహ్మానందం ను ప్రశంసించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్ట్ షేర్ చేశారు.గురించి పాజిటివ్ విషయాలు వింటున్నాను. రాజా గౌతమ్, బ్రహ్మానందం గారికి, టీమ్ అందరికీ హృదయ పూర్వక అభినందనలు అంటూ తారక్ పోస్ట్ చేశారు దానికి బ్రహ్మానందం రిప్లే ఇస్తూ థాంక్యూ సోమచ్ నాన్న  ఈ ఫీలింగ్ ఏంట్రా గుండె ఎదో వణుకుతున్నట్టు ఉందిరా, అంటూ అదుర్స్ లోని డైలాగ్ రాసుకొచ్చారు బ్రహ్మానందం. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదుర్స్ లో ఎన్టీఆర్, బ్రహ్మానందం కాంబినేషన్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇదిలావుండగా చిన్న సినిమా గా వచ్చిన బ్రహ్మ ఆనందం’ చిత్రానికి రూ.6.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లో ఈ సినిమా రూ.0.51 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.0.86 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కి రూ.6.49 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: