
ఇక ఇప్పుడు వెంకి అట్లూరి సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పై నాగ వంశీ నిర్మించబోతున్నారు .. వెట్రిమారన్ సూర్యతో చేసే వాడివాసల్ ఇంకా ఆలస్యమయ్యేలా ఉండటంతో ఆలోగా వెంకీ అట్లూరి తన ప్రాజెక్టు పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడట. ఈ కొలాబరేషన్ కారణంగానే సితార నిర్మిస్తున్న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ తమిళ వెర్షన్ కి సూర్య వాయిస్ ఓవర్ ఇచ్చాడు . అంటే ఇది ముందు నుంచి ప్లాన్డ్ గా సెట్ చేసుకున్న కాంబోని అర్థమయ్యింది . అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా భాగ్యశ్రీ భోర్సే ను తీసుకునే అవకాశం ఉంది ..
ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదు కానీ ఈమె హీరోయిన్ అనడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది .. ఇప్పటికే విజయ్ దేవరకొండ , రామ్ లకు జంటగా సినిమాలు చేస్తుంది . ఇక ఈమె మొదటి సినిమా మిస్టర్ బచ్చన్ భారీ డిజాస్టర్ అయింది .. అలాంటి భారీ ఫ్లాఫ్ ఈ మధ్యకాలంలో లేదు .. కానీ భాగ్యశ్రీ అంటే టాలీవుడ్ మాత్రం బాగా ఇష్టపడుతుంది .. ఛాన్సులు ఆమెకు వెతుక్కుంటూ వస్తున్నాయి . ఇప్పుడు సూర్య కు జంటగా ఛాన్స్ వచ్చింది .. అంటే ఇప్పుడు మూడు భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తుంది .. ఇక మరి సూర్యకు భాగ్యశ్రీ అయిన హిట్ ఇస్తుందో లేదో చూడాలి .