
ముఖ్యంగా ఇందులో నాన్న సెంటిమెంట్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్టీఆర్ తండ్రిగా నటుడు రాజేంద్రప్రసాద్ నటించారు. రాజేంద్రప్రసాద్, ఎన్టీఆర్ మధ్య వచ్చే సన్నివేశాలకు ఎంతోమంది అభిమానులు ఆకర్షితులు అయ్యారు. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించారు.
జగపతిబాబు విలన్ పాత్రను పోషించారు. రాజీవ్ కనకాల కీలక పాత్రను పోషించారు. కాగా, ఈ సినిమా 13 జనవరి 2016 వ తేదీన విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను రూ. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక నాన్నకు ప్రేమతో సినిమా రూ. 130 కోట్ల కలెక్షన్లను రాబట్టి మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్, జగపతిబాబు మధ్య వచ్చే సీన్లు సినిమాకే హైలైట్ గా నిలిచాయి. ఈ సినిమాలోని పాటలకు ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ వరుసగా సినిమాలో నటించి మంచి విజయాలను అందుకున్నాడు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ సినిమా తర్వాత దేవర సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఎన్టీఆర్ తన తదుపరి సినిమా గురించి ఆలోచనలో ఉన్నారట.