గత కొన్ని సంవత్సరాలుగా మలయాళ చిత్ర పరిశ్రమలో పెద్ద సంఖ్యలో హిట్ సినిమాలు వస్తున్నాయి .. గత సంవత్సరం కూడా ‘మంజుమేల్ బాయ్స్’, ‘ఆవేశం’, ‘పాలం పలవుమ్’ వంటి తదితర మంచి సినిమాలు వచ్చాయి .. అయితే అంతకుముందు 2023 లోను ‘ఇరట్ట’, ‘నేరు’, ‘2018’, ‘రోమాంచనం’ వంటి మంచి సినిమాలు రిలీజ్ అయ్యాయి .. ప్రధానంగా కోవిడ్ తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సిని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది .. అయితే జూన్ 1 నుంచి మాత్రం మలయాళ చిత్ర పరిశ్రమ మొత్తం మూతపడనుంది .. గత సంవత్సరం అత్యధిక సూపర్ హిట్ సినిమాలు నిర్మించింది కూడా మలయాళ చిత్ర ప‌రిశ్ర‌మె ..


పెద్ద హిట్స్ అందించినప్పటికీ మలయాళ నిర్మాతలు గత సంవత్సరం దాదాపు 600 నుంచి 700 కోట్లు నష్టపోయినట్టు తెలుస్తుంది .. ఇక దీనికి ప్రధాన కారణం ఏమిటంటే . నటులు , సాంకేతిక నిపుణులు తమ రెమ్యునరేషన్లను   భారీ మొత్తంలో పెంచేశారు .. అంతేకాకుండా ప్రభుత్వ పన్నుల కారణంగా కూడా సినిమా నుంచి వచ్చే లాభాలు నిర్మాతలకు రావటం లేదు .. దీని కారణంగా చిత్రా నిర్మాతలు , పంపిణీ దారులు అందరూ కలిసి భారీ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇక 2024 లో 200 మలయాళ సినిమాలు రిలీజ్ అయ్యాయి .. కానీ వాటిలో 24 మాత్రమే మంచి విజయం సాధించాయి . దీని ఫలితంగా నిర్మాతలు 600 నుంచి 700 కోట్లు నష్టపోయారు .. దీని కారణంగా మలయాళ చిత్ర నిర్మాతలు పంపిణీదారులు ఇతర సంఘాలు ఒక సమావేశ నిర్వహించి జూన్ 1 నుంచి పూర్తి బంద్‌ పాటించాలని భావిస్తున్నాయి ..


అయితే ఇదే సమయంలో స్టార్ నటుడు మోహన్ లాల్ నటించిన ‘L2 తో సహా అనేక ఇతర పెద్ద చిన్న సినిమాలు విడుదల కానున్నాయి .. ఇలాంటి స‌మ‌యంలో సమ్మె సినిమాలకు పెద్ద దెబ్బ అవుతుంది కాబట్టి కొంతమంది నిర్మాతలు ఈ బంద్‌ను వ్యతిరేకిస్తున్నారు.. ఇప్పటికే ప్రముఖ మలయాళ నిర్మాత జి సురేష్ కుమార్ మాట్లాడు నటులు సాంకేతిక నిపుణులు తమ రెమ్యూనరేషన్లు భారీగా పెంచుకున్నారు .. అలాగే జీఎస్టీ వినోద పన్ను ఇతర కారణాల కారణంగా నిర్మాతలకు సినిమా నుంచి లాభాలు రావటం లేదు .. ఒక సినిమా 100 కోట్లు రాబట్టిందంటే అన్ని పనులు చెల్లించిన తర్వాత నిర్మాతకు 27 కోట్లు మాత్రమే వస్తున్నాయని ఆయన వాపోతున్నారు. ఇలా అన్ని విధాలుగా నిర్మాతలకు భారీ నష్టాలు రావడంతో.. ఇలాంటి సంచలన‌ నిర్ణయం తీసుకోబోతుంది మలయాళ చిత్ర పరిశ్రమ . అయితే ఇప్పుడు ఈ ఇష్యూ టాలీవుడ్ పై కూడా ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: