టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే కొన్ని సంవత్సరాల పాటు వారి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. కొంతమంది మాత్రం అదృష్టం కలిసి రాక సినిమాలలో పెద్దగా రాణించలేక పోతారు. అలాంటి వారిలో టాలీవుడ్ లవర్ బాయ్ సిద్ధార్థ్ ఒకరు. ఈ హీరో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఈ మధ్యకాలంలో తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు.


ఇక సిద్ధార్థ్ తన కెరీర్ లో చేసిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలలో బొమ్మరిల్లు సినిమా ఒకటి. ఈ సినిమా అప్పట్లో యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలలో వస్తే చూసేవారు ఎంతోమంది ఉన్నారు. బొమ్మరిల్లు సినిమాకు విపరీతంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో జెనీలియా చిన్నపిల్లల అమాయకంగా చాలా అద్భుతంగా నటించింది. తన నటనకు గాను ఎన్నో ప్రశంసలు సైతం అందుకుంది.


ఈ సినిమాకు భాస్కర్ దర్శకత్వం వహించారు. 2006 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో జయసుధ, ప్రకాష్ రాజ్, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు వంటి నటీమణులు కీలక పాత్రలను పోషించారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ సిద్ధార్థ్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలిచాయి. ఇప్పటికి ఆ డైలాగ్స్ ను చాలామంది వాడుతూ ఉంటారు. ఈ సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య బాండిగ్ చాలా బాగుంటుంది.


ప్రకాష్ రాజ్ తండ్రి పాత్రలో చాలా బాగా నటించాడు. ప్రతి ఒక్క తండ్రి తన పిల్లల గురించి ఎంత బాగా ఆలోచిస్తాడు అనేది ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. తన పిల్లల కోసం కష్టపడి అడిగిన దానికి మించి ఇవ్వాలనే తపనతో ప్రకాష్ రాజ్ ఉంటాడు. కానీ ప్రకాష్ రాజ్ ప్రేమను అతి ప్రేమగా భావించే సిద్ధార్థ్ తన తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేక పోతాడు. ఇక సినిమా చివర్లో ప్రకాష్ రాజ్ తన కొడుకు ప్రేమను అర్థం చేసుకొని తనకు నచ్చిన విధంగా ఉంటాడు. కాగా, ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుని సిద్ధార్థ్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: