
డ్రాగన్ సినిమా ఈ నెల 21న గ్రాండ్గా రిలీజ్ చేయబోతూ ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాదులో చాలా గ్రాండ్గా చేశారు. అందుకు గెస్ట్ గా డైరెక్టర్ హరిశంకర్ తో పాటుగా ప్రముఖ నిర్మాతలలో ఒకరైన నిర్మాత SKN కూడా హాజరయ్యారు. అక్కడ ఈయన చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో సంచలనం గా మారుతున్నాయి. మొదటిగా హీరోయిన్ కాయాద్ లోహర్ గారికి తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినందుకు స్వాగతం పలుకుతున్నామంటూ తెలిపారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగు వచ్చిన హీరోయిన్లు కంటే తెలుగు రానివారే హీరోయిన్లుగా చేయడానికి తాము చాలా ఇష్టపడతామని వెల్లడించారు.. అందుకు కారణం ఉందని కూడా తెలుపుతూ.. తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఆ తర్వాత తమకు ఏం జరుగుతుందో అనుభవం అయింది అంటూ వెల్లడించారు నిర్మాత SKN. అందుకే ఇకనుంచి తాను కాని తన డైరెక్టర్ కానీ తెలుగు రానీ హీరోయిన్ లానే తీసుకోవాలనుకుంటున్నామంటూ వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా వైష్ణవి చైతన్య డైరెక్టర్ ని మోసం చేసిందా అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మరియు విషయం పైన వైష్ణవి చైతన్య ఎలా స్పందిస్తుందో చూడాలి.