నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ప్రేమమ్' మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆ అమ్మడు.. తన ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఆ తర్వాత ‘ఫిదా’ సినిమాలో నటించి మెప్పించింది. అంతే కాకుండా తన యాక్టింగ్‌తో అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేసేసింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అంతే కాకుండా బోల్డ్ సీన్స్‌లో యాక్ట్ చేయకపోవడం, మేకప్ వేసుకోకపోవడం వల్ల మరింత ఫేమ్ అయింది.ఆమె నటించిన లేటెస్ట్ మూవీ 'తండేల్'  బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. నాగచైతన్య సరసన సాయిపల్లవి నటనకు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె నేషనల్ అవార్డుపై కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ అవార్డు కోసం తాను ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అందుకో బలమైన కారణం ఉందని చెప్తూనే తన మామ్మ చీర సెంటిమెంట్‌ను రివీల్ చేశారు.ఈ క్రమంలో తాజాగా ఇంటర్య్వూలో సాయి పల్లవి మాట్లాడుతూ “నాకు 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా మామ్మ ఓ చీర గిఫ్ట్‌గా ఇచ్చింది. అది ఇస్తూ నా పెళ్లికి ఈ చీర కట్టుకోమని చెప్పింది. అప్పటికి ఇంకా నేను సినిమాల్లోకి రాలేదు. కాబట్టి పెళ్లి చేసుకున్నప్పుడు దానికి కట్టుకుందామనుకున్నా. మూడేళ్ల తర్వాత సినిమాల్లోకి వచ్చా. నా ఫస్ట్‌ చిత్రం ప్రేమమ్‌తో ఇండస్ట్రీకి వచ్చా. పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో ఏదోక రోజు ప్రతిష్టాత్మక అవార్డు అందుకుంటానని నమ్మాను. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో జాతీయ అవార్డు తీసుకోవడం అంటే చాలా గొప్ప.

కాబట్టి నేషనల్‌ అవార్డు అందుకున్న రోజు మా మామ్మ ఇచ్చిన చీర కట్టుకుని ప్రదానోత్సవం కార్యక్రమానికి హాజరవ్వాలని కోరిక. అందుకే జాతీయ అవార్డు కోసం ఆశగా ఎదురుచూస్తున్నా.అవార్డు తీసుకున్న తీసుకోకపోయినా.. ఈ చీర ధరించే వరకు నాపై ఒత్తిడి మాత్రం ఉంటూనే ఉంటుంది” అని చెప్పుకొచ్చారు. కాగా ఆమె నటించిన గార్గి సినిమాకు గానూ సాయి పల్లవి జాతీయ అవార్డు అందుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ చివరకు నిరాశే ఎదురైంది. ఆ ఏడాది సాయి పల్లవిని కాకుండా నిత్యామేనన్‌ను నేషనల్‌ అవార్డు వరించింది.ఇక ఈ భామ డ్యాన్స్‌కి అయితే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. అయితే సాయి పల్లవి రీసెంట్‌గా ‘అమరన్' మూవీతో మంచి విజయం సాధించింది. ఇక తాజాగా నాగ చైతన్య, చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ‘తండేల్’ సినిమాలో కూడా నటించి అలరించింది. తన యాక్టింగ్‌తో ఆడియన్స్‌ నుంచి ఫుల్ మార్కులే కొట్టేసింది. లవర్స్ డే కానుకగా అల్లు అరవింద్  సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: