తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూర్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించాడు. అందులో చాలా సినిమాలను తెలుగులో విడుదల చేశాడు. ఈయన తెలుగులో విడుదల చేసిన సినిమాలలో చాలా సినిమాలు అద్భుతమైన విజయాలను సాధించడంతో సూర్య కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే ఈయన నేరుగా తెలుగు లో ఒక సినిమా చేయబోతున్నాడు అని కొన్ని రోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు సూర్య తెలుగు లో ఒక్క సినిమా కూడా చేయలేదు.

ఇకపోతే ప్రస్తుతం మాత్రం సూర్య ఏకంగా ఇద్దరు తెలుగు దర్శకులతో సినిమా చేయడానికి కమిట్ అయినట్లు తెలుస్తోంది. చాలా కాలంగా గీత ఆర్ట్స్ బ్యానర్లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో సూర్య ఓ తెలుగు సినిమా చేయబోతున్నాడు అని ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా ఈ క్రేజీ కాంబోలో మూవీ కన్ఫామ్ అయినట్లు , మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు ఆ వార్త వైరల్ అవుతుంది.

ఇక ఈ మధ్య కాలంలో వరస పెట్టి ఇతర భాష హీరోలతో సినిమాలు చేస్తున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరో గా ఓ మూవీ కూడా ఆల్మోస్ట్ కన్ఫామ్ అయినట్లు , ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో ధనుష్ , దుల్కర్ సల్మాన్ వరస పెట్టి తెలుగు సినిమాల్లో నటిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. మరి సూర్య కూడా వారిలా గానే తెలుగులో మంచి విజయాలను అందుకుంటాడో లేదో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: