
ఇక 1991లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమ్మ రాజీనామా సినిమాలో కూడా తల్లి సెంటిమెంట్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది .. దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ సినిమాను తెరకెక్కించారు .. తల్లి పాత్రలో సీనియర్ నటి శారద నటించారు.. అమ్మ పాత్రలో శారద ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో చెరిగిపోని ముద్ర వేసుకునేలా నటించారు. తన కుటుంబం కోసం ఎంతో కష్టపడే తల్లి తన విలువను గుర్తించలేని కుటుంబ సభ్యుల మధ్య తన బాధ్యతలు మానేస్తే ఏమవుతుందో చూపించే సినిమా ఇది. అలాగే 1993 లో వచ్చిన మాతృదేవోభవ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది .. ముఖ్యంగా ఈ సినిమాలో వేటూరి రచించిన రాలిపోయే పువ్వా సాంగ్ ఇప్పటికీ సంగీత ప్రేక్షకుల మనసులో పదిలంగా ఉంది . అలాగే తల్లి సెంటిమెంట్ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు మాతృదేవోభవ సినిమా గుర్తుకువస్తుంది .. భర్తను కోల్పోయిన ఒక స్త్రీ క్యాన్సర్ తో తను కొద్ది రోజుల్లో చనిపోతానని తెలుసుకుని తన ముగ్గురు పిల్లల భవిష్యత్తు కోసం పడే తపన ఆరాటమే ఈ సినిమా.. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ మాధవి ప్రధాన పాత్రలో నటించింది.
1994 నాలుగులో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఆలీ హీరోగా వచ్చిన సినిమా యమలీల.. ఫాంటసీ కామెడీ తో పాటు ప్రాణాలు కాపాడుకోడానికి ఓ సాధారణ యువకుడు ఏకంగా యముడిని ముప్పుతిప్పలు పెట్టడాన్ని ఎంతో ఫన్నీగా ఎమోషనల్ గా ఈ సినిమాలు చూపించారు . ఈ సినిమా కూడా తల్లి సెంటిమెంట్తో ఎంతో మంచి పేరు తెచ్చుకుంది.దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియ హీరో ప్రభాస్ హీరోగా వచ్చిన యాక్షన్ డ్రామా చత్రపతి .. కమర్షియల్ సినిమా అయినా మెయిన్ పాయింట్ మొత్తం తల్లి చుట్టూనే ఉంటుంది .. ఈ సినిమా కూడా ఇప్పటికీ తల్లి సెంటిమెంట్ సినిమాల్లో గొప్ప సినిమాగా నిలిచింది. సీనియర్ హీరో రాజశేఖర్ , సాక్షి శివానంద్ కలిసిన నటించిన సింహరాశి .. ఈ మూవీ కూడా మదర్ సెంటిమెంట్ తోనే తెరకెక్కింది .. ప్రధానంగా ఈ సినిమాలో తల్లి కొడుకుల ఎపిసోడ్ ఎంతో ఎమోషనల్ గా ఉంటుంది .. ఈ సినిమాను కోలీవుడ్ లో వచ్చిన 'మాయి' ఈ సినిమాకి తెలుగులో వి. సముద్ర తెరకెక్కించారు. ఈ సినిమా కూడా తల్లి సెంటిమెంట్ సినిమాల్లో గొప్ప సినిమాకు నిలిచింది.
ఈ సినిమాల కాకుండా తల్లి చనిపోయిన నేపథం వచ్చిన చాలా సినిమాలు కుటుంబ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి . ఎన్టీఆర్ ఏఎన్నార్ కృష్ణ శోభన్ బాబు కృష్ణంరాజు దగ్గరనుంచి చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వరకు ఎందరో హీరోలు అమ్మ సెంటిమెంట్తో భారీ ఉద్యోగం అందుకున్నారు . చిరంజీవి నటించిన ముగ్గురు మొనగాళ్లు రాక్షసుడు, అడుగుదొంగ బాలకృష్ణ భైరవద్వీపం వంశానికొక్కడు. నాగార్జున మనం వెంకీ మామ అబ్బాయిగారు ధ్రువ నక్షత్రం సినిమాలు కూడా అమ్మ సెంటిమెంట్ చుట్టూ అల్లుకున్న కథలతో తెరకెక్కాయి .. మహేష్ నాని రామ్ చరణ్ చిరుత, పవన్ కొమరం పులి సినిమాలు కూడా ఇదే కోవకు చెందుతాయి.