చూస్తుంటే మహేష్ బాబు టైం అస్సలు బాగోలేనట్టు ఉంది . జక్కన్నతో మూవీకి కమిట్ అయ్యాడు అని ఆనందపడాలో... త్వరలోనే బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంటాడు అని ఆశపడాలో.. లేకపోతే సినిమా షూట్ లేట్ అవుతుంది ఈ కారణంగా ఆయన పలు మంచి మంచి సినిమా అవకాశాలను మిస్ అయిపోతున్నాడు అని బాధపడాలో తెలియని అయోమయ సిచువేషన్ లో ఉన్నారు ఫ్యాన్.  అయితే ఇప్పుడు దాని మీద ఇంకా కారం చల్లుతున్నట్లు మహేష్ బాబు అభిమానులకి బాగా మండిపోయే విధంగా జనాలు ఎస్ ఎస్ ఎం బి 29 సినిమా విషయంలో ట్రోలింగ్ చేస్తున్నారు .


రాజమౌళితో సినిమా అంటే మాటలు కాదు.  ఓపిక చాలా ఉండాలి . కానీ అది చాలా తక్కువ మహేష్ బాబుకి . అయితే ఈ సినిమా షూటింగ్ విషయంలో రాజమౌళి పెడుతున్న కొన్ని కండిషన్స్ మహేష్ బాబుకు కోపం తెప్పిస్తున్నాయట . అంతేకాదు మరీ ముఖ్యంగా సినిమా టైటిల్ విషయంలో ఇంతవరకు ఒక నిర్ణయం తీసుకోకపోవడం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆలస్యం చేస్తూ ఉండటం మహేష్ బాబుకు కోపం తెప్పిస్తుందట . ఆల్రెడీ ఈ సినిమా అనుకున్న రెండు టైటిల్స్ వేరే వాళ్ళు బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ కూడా చేసేసుకున్నారట .



ఇప్పుడు ఈ సినిమా కోసం గరుడ , మహారాజ్ అనే రెండు పేర్లు సెర్చ్ చేస్తున్నారట జక్కన్న . అయితే ఈ రెండు పేర్లు పై కూడా ఇంకా టీం ఫుల్ సాటిస్ఫై కాలేదట . ఈ క్రమంలోనే సినిమా టైటిల్ ఇంకా ఆలస్యం చేసే విధంగా ఉన్నారు అంటూ ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు . ఒక సినిమా ప్రమోషన్స్ ఎక్కువగా రావాలి అంటే ముందుగా టైటిల్ అనౌన్స్ చేయాలి . ఆ టైటిల్ కరెక్ట్ గా పెడితే సగం సినిమా హిట్ అయినట్టే.  ఇప్పటివరకు రాజమౌళి పెట్టిన ప్రతి సినిమా టైటిల్ మంచిగా ఉంది . సగం సినిమా హిట్ అవ్వడానికి కారణం ఆయన పెట్టే టైటిల్స్ . మరి మహేష్ బాబు సినిమాకి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నాడు అనేది అర్థం కావడం లేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: