సోషల్ మీడియాలో ఎప్పుడైనా సరే స్టార్ హీరోస్ - హీరోయిన్స్ - డైరెక్టర్ లు-  పొడ్యూసర్స్ ..స్టార్ సెలబ్రిటీస్ ట్రోల్లింగ్ కి గురవుతూనే ఉంటారు . ఒక స్టార్ సెలబ్రిటీ ఆ ట్రోలింగ్ బాధల నుంచి తప్పించుకోగానే మరొక స్టార్ సెలబ్రిటీ ఇంకోసారి ట్రోల్ అవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అయితే ఇప్పటివరకు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొని సూపర్ స్టార్ మహేష్ బాబు . ఫస్ట్ టైం సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు . అది కూడా ఒక సినిమా కారణంగా .


దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు మహేష్ బాబు పేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. తన పని తాను చేసుకునిపోయే మహేష్ బాబుని కావాలనే కొందరు గెలికి రాద్ధాంతం చేస్తూ ఆయన పేరుని బ్రష్టు పట్టిస్తూ ట్రోల్ చేస్తున్నారు . దానికి కారణం "చావా" సినిమా . ఎస్ రీసెంట్ గానే బాలీవుడ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే 110 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది . కాగా ఈ సినిమాను ముందుగా విక్కీ కౌశల్ కన్నా మహేష్ బాబు కి స్టోరీ వినిపించారట డైరెక్టర్ .



పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను తెరకెక్కించాలి అని మహేష్ బాబు  అయితే అందుకు పర్ఫెక్ట్ అంటూ "గుంటూరు కారం" సినిమా టైంలోనే ఈ సినిమా కథను వినిపించారట . అయితే మహేష్ బాబు ఇలాంటి ఒక హిస్టరీ నేపథ్యంలో  కాన్సెప్ట్స్ తనకు పెద్దగా నచ్చవు అంటూ కథ వినకుండానే  సింగిల్ లైన్ కాన్సెప్ట్ రిజెక్ట్ చేశారట . ఆ తర్వాత ఈ కథను చాలా మంది తెలుగు హీరోలకి వినిపించారట డైరెక్టర్ కానీ అందరు రిజెక్ట్ చేయడంతో ఫైనల్లీ బాలీవుడ్ గూటికే వెళ్లి అక్కడ స్టార్ హీరో అయిన విక్కీ కౌశల్ తో ఈ సినిమాను తెరకెక్కించారు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: