సినిమా ఇండస్ట్రీ లో ఏ సినిమా కైనా మొదటి రోజు వచ్చిన కలెక్షన్ల కంటే కూడా ఆ తర్వాత లాంగ్ రన్ లో వచ్చే కలెక్షన్లు ఎంతో కీలకం. ఎందుకు అంటే స్టార్ హీరోల సినిమాలకు మొదటి రోజు మంచి కలెక్షన్లు రావడం సహజం. అలాగే మీడియం రేంజ్  , చిన్న హీరోల సినిమాలకి కూడా సినిమాపై అంచనాలు ఏర్పడినట్లయితే వారు నటించిన సినిమాలకు మొదటి రోజు మంచి కలెక్షన్లు రావడం పెద్ద విషయం ఏమీ కాదు. కానీ లాంగ్ రన్ లో మంచి కలెక్షన్లు రావాలి అంటే ఆ సినిమాకు మంచి టాక్ వస్తేనే అది జరుగుతుంది.

మంచి కలెక్షన్లు వచ్చిన సినిమాలకు భారీ ఎత్తున కలెక్షన్లు రావడం , నిర్మాతలకు , డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావడం జరుగుతుంది. ఇకపోతే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా వెంకటేష్ హీరో గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు బ్లాక్ బాస్టర్ టాక్ రావడంతో ఈ మూవీ కి ఇప్పటికి కూడా మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఇకపోతే నిన్న అనగా ఆదివారం రోజు కి సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల అయ్యి 34 వ రోజు.

ఇక 34 వ రోజు కూడా ఈ సినిమా తక్కువ థియేటర్లలో ప్రదర్శించబడిన ఎక్కువ కలెక్షన్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ "లైలా" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఫిబ్రవరి 14 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి ఘోరమైన నెగెటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ 3 వ రోజు సంక్రాంతికి వస్తున్నాం 34 వ రోజు కంటే కూడా తక్కువ కలెక్షన్లను వసూలు చేసే అవకాశాలు ఉన్నట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: