టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ కొనసాగిస్తున్న ఓ ముద్దుగుమ్మ చాలా సంవత్సరాల క్రితమే కెరియర్ను మొదలు పెట్టింది. అలాగే ఇప్పటి వరకు అనేక సినిమాలలో హీరోయిన్గా నటించింది. అందులో కేవలం ఒకే ఒక సినిమా మంచి విజయాన్ని సాధించగా , రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. ఆ రెండు సినిమాలలో కూడా ఒకరే హీరోగా నటించడం విశేషం. మరి ఆ ఒక్క హీరో ద్వారానే అద్భుతమైన విజయాలను అందుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా ..? ఆమె మరెవరో కాదో ప్రగ్యా జస్వాల్. 

బ్యూటీ మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమాతో తెలుగు తరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఈమె కంచే అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమెకు వరుస పెట్టి తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ ఈమె నటించిన ఏ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర విజయం సాధించలేదు. అలా కెరియర్ను చాలా డల్ గా కొనసాగిస్తున్న సమయం లోనే ఈ బ్యూటీ బాలకృష్ణ హీరోగా రూపొందిన అఖండ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక తాజాగా ఈ బ్యూటీ బాలకృష్ణ హీరో గా రూపొందిన డాకు మహారాజ్ సినిమాలో నటించింది. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం బాలయ్య అఖండ 2 లో హీరో గా నటిస్తున్నాడు. ఈ  సినిమాలో కూడా ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రగ్యా జైస్వాల్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించిన కేవలం బాలకృష్ణ హీరోగా రూపొందిన సినిమాల ద్వారానే ఈమెకు బ్లాక్ బస్టర్ విజయాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: