టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. అందులో చాలామంది తెలుగు వారే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ ఇలా వివిధ రకాల భాషలకు చెందిన అమ్మాయిలు కూడా హీరోయిన్లుగా పరిచయమై వారి సత్తాను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇతర భాషలకు సంబంధించిన హీరోయిన్లకే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభిస్తోంది. తెలుగు హీరోయిన్లకు పెద్దగా ఛాన్సులు రావడం లేదు. అయితే ఇదే విషయంపైన ఓ ప్రముఖ నిర్మాత హాట్ కామెంట్స్ చేశారు.


నిన్న డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత ఎస్ కే ఎన్ (శ్రీనివాస్ కుమార్) పాల్గొన్నారు. అందులో భాగంగా అతను మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మేము తెలుగు వచ్చిన అమ్మాయిల కన్నా తెలుగు రాని అమ్మాయిలని ఎక్కువగా ఇష్టపడతామని అన్నారు. తెలుగువారిని కాకుండా ఇతర భాషలకు చెందిన అమ్మాయిలనే ప్రేమిస్తామని ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్ హాట్ కామెంట్స్ చేశారు.


తెలుగు వచ్చిన అమ్మాయిలని ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో తర్వాత తెలిసింది అంటూ సంచలన కామెంట్లు చేశారు. అతను అలా మాట్లాడడంతో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా వారి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలుగు హీరోయిన్లను కించపరుస్తూ అలా మాట్లాడడంతో సిని ప్రముఖులు, అభిమానులు ప్రతి ఒక్కరూ ఎస్ కే ఎన్ పైన తీవ్రంగా విమర్శలు ట్రోలింగ్ చేస్తున్నారు. తెలుగు హీరోయిన్లను ఎంకరేజ్ చేస్తే ఏమవుతుంది వారు అంత పెద్ద తప్పు ఏమి చేశారు అని అంటున్నారు.


ఇతర భాషల హీరోయిన్లను ప్రేమించడానికి గల కారణాలు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం మరింత చిలరేగేలా కనిపిస్తోంది. ఇలా అతను మాట్లాడిన మాటలకు గాను తెలుగు హీరోయిన్లకు క్షమాపణలు చెప్పాలంటే కొంతమంది అంటున్నారు. మరి అతను అలా మాట్లాడటం వెనుక గల కారణం ఏంటో చెప్పాలంటూ అంటున్నారు. ఈ విషయం పైన ఎస్ కే ఎన్ ఎలా స్పందిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: