
నితిన్ : ఈ యువ నటుడు జయం అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత కూడా ఈయన నటించిన సినిమాలలో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ వచ్చింది. ఇక ఆ తర్వాత నుండి ఈయనకు వరుస పెట్టి అపజయాలు వచ్చాయి. కొన్ని సంవత్సరాల పాటు అనేక సినిమాలతో ఈయనకు ప్లాప్స్ వచ్చాయి. దానితో ఈయన కెరియర్ క్లోజ్ అయింది అని చాలా మంది అనుకున్నారు. అలాంటి సమయంలోనే ఈయన ఇష్క్ అనే సినిమాలో హీరో గా నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. అప్పటి నుండి ఈయన కెరియర్ను చాలా స్టడీగా కొనసాగిస్తూ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు.
నిఖిల్ : హ్యాపీ డేస్ మూవీ ద్వారా ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈయనకు చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ అందులో ఒకటి రెండు సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో ఈయనకు నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఆ తర్వాత నిఖిల్ కి వరుస పెట్టి అపజయాలు వచ్చాయి. దానితో ఈయన కెరియర్ టోటల్ గా క్లోజ్ అయింది అని జనాలు అభిప్రాయానికి వచ్చారు. అలాంటి సమయం లోనే ఈయన స్వామి రారా అనే సినిమాలో హీరోగా నటించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని అదిరిపోయే రేంజ్ లో కం బ్యాక్ ఇచ్చాడు. అప్పటి నుండి ఈయన మంచి కథలను ఎంచుకుంటూ అనేక విజయాలను అందుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు.