
చిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ మనోవేదనకు గురయ్యారు. తారకరత్న అభిమానులు ఎంతగానో బాధపడ్డారు. ఇక తన కుటుంబ సభ్యులు, తన భార్య పిల్లలు ఇప్పటికీ తారకరత్నను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు. తన ఫోటో దగ్గర ఫోటోలు తీసుకుంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ తారకరత్నను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు. తన భర్త జ్ఞాపకాలను మర్చిపోలేక అలేఖ్య రెడ్డి ఇప్పటికీ కుమిలిపోతుంటారు.
తన భర్త లేకపోయినప్పటికీ తన పిల్లల ఆలనా పాలన దగ్గరుండి మరి అలేఖ్య రెడ్డి చూసుకుంటుంది. పిల్లలతో సమయాన్ని గడుపుతూ సంతోషంగా వారిని చూసుకుంటుంది. ఇక అలేఖ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తారకరత్నతో వీడియోలు, ఫోటోలు తీసుకొని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా.... అలేఖ్య రెడ్డి తన బంధువుల ఇంటికి ఓ ఫంక్షన్ కు వెళ్లారు.
అక్కడ వారితో కలిసి ఫోటోలు తీసుకొని వాటిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. అక్కడికి అలేఖ్య రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు వైసిపి నేతలు కూడా వచ్చినట్లుగా సమాచారం అందుతుంది. తనకు చాలా దగ్గర బంధువులు కావడంతో అలేఖ్య రెడ్డి ఈ ఫంక్షన్ కు వెళ్లారట. ఈ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి.