సోషల్ మీడియాకి చాలామంది ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు ఎవరిని ట్రోల్ చేస్తారో చెప్పడం కూడా కష్టమే. తాజాగా ఇప్పుడు మహేష్ బాబు మీద కొంతమంది యాంటీ ఫ్యాన్స్ పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. నిజం చిత్రంలో మహేష్ బాబుకు తల్లిగా నటించిన రామేశ్వరి మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యాంటీ ఫ్యాన్స్ మహేష్ బాబు మీద కౌంటర్లు వేస్తూ ఉన్నారట. మరి ఆ నటి రామేశ్వరి ఏం మాట్లాడింది అందుకు గల కారణమేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.


ఈ వీడియోలో.. మహేష్ బాబు రామేశ్వరి మధ్య ఉన్న బాండింగ్ అని తెలియజేస్తూ ఒక క్లిప్పుని షేర్ చేయడం జరిగింది.. ఏదో ఒక ఈవెంట్ లో మహేష్ బాబు రామేశ్వరి కలిసి ఈవెంట్లో ఉన్నారట.. అయితే రామేశ్వరి గారు మహేష్ బాబు వెనకలే కూర్చున్న అయితే ఆ విషయాన్ని గమనించలేదట మహేష్ బాబు.. కానీ ఏదో అనుకోకుండా వెనక్కి తిరిగి చూసినప్పుడు.. ఏంటి మీరు కూడా వచ్చారా అని అడగగా.. అవును మీ వెనకాలే కూర్చున్నాను అంటూ  చెప్పిందట రామేశ్వరి.. అదేంటి మాట్లాడించొచ్చు కదా  అని అన్నారని.. కానీ మాట్లాడించవచ్చు మరి మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని రామేశ్వరి అన్నదట.. దీంతో మహేష్ బాబు మీరు నన్ను కొట్టి అయినా కూడా మాట్లాడవచ్చు ఆ విషయం మీకు తెలుసా అంటూ మహేష్ బాబు చెప్పారట.


అయితే ఆ విషయం తనకి తెలిసినా కూడా తాను ఆ పని చేయనని తనకి ఆ అవసరం లేదంటూ తెలియజేసింది రామేశ్వరి. అడ్వాంటేజ్ ఇచ్చారని ఇలా చేయకూడదు కదా అంటూ తెలిపింది రామేశ్వరి.. దీంతో కొంతమంది యాంటి ఫ్యాన్స్ ఎవరికి నచ్చినట్టుగా వారు సోషల్ మీడియాలో  ట్రెండీగా చేస్తూ ఉన్నారు.అయితే రామేశ్వరి పాత వీడియోలను గతంలో మాట్లాడిన వీడియోలను షేర్ చేస్తూ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు మొత్తానికి మరొకసారి మహేష్ బాబు పేరు ట్రెండిగా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: