నిజంగానే రష్మిక మందన్నా నక్క తోక తొక్కిందేమో లేకపోతే ఆమె అదృష్టాన్ని తన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని తిరుగుతుందేమో.. ఒక హీరోయిన్ పాన్ ఇండియా సినిమాలు అవకాశాలు సంపాదించుకోవడానికి నానాతంటాలు పడిపోతున్న ఈ మూమెంట్లో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలను అందుకోవడమే కాకుండా కమిట్ అయిన ప్రతి సినిమాను కూడా సూపర్ డూపర్ హిట్ గా మార్చేస్తుంది అంటే కచ్చితంగా అది రష్మిక మందన్నా హార్డ్ వర్క్ అదే విధంగా లక్ అనే చెప్పాలి .


ఎంత హార్డ్ వర్క్ ఉన్నా కొన్ని కొన్ని విషయాలలో లక్ కలిసి రాదు. అయితే రష్మిక మందన్నాకు మాత్రం లక్ పూర్తిగా కలిసివస్తుంది. మొదటగా "అనిమల్" ఆ తర్వాత "పుష్ప" ఇప్పుడు "చావా". బ్యాక్ టు బ్యాక్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకొని సౌత్ లోనే కాకుండా నార్త్ ను కూడా గజగజ వణికించేస్తుంది. సౌత్ ఇండియాలో క్రెజియస్ట్ హీరోయిన్గా నయనతార ఎంత పాపులారిటీ సంపాదించుకుందో .. ఇప్పుడు అంతకు పది రెట్లు రష్మిక మందన్నా పాపులారిటీ సంపాదించుకుంటుంది .



అయితే తాజాగా సోషల్ మీడియాలో మరొక వార్త ట్రెండ్ అవుతుంది. రష్మిక మందన్నా మరొక జాక్పాట్ ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఇది ఫుల్ టు ఫుల్ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీగా తెలుస్తుంది. అది కూడా కాంట్రవర్షియల్ సబ్జెక్టుని చూస్ చేసుకుంది అంటూ తెలుస్తుంది . హీరోయిన్ ప్రత్యూష మరణం మిస్టరీ గురించి అందరికీ తెలిసిందే . ఇప్పటికీ కూడా దీనిపై రకరకాలుగా జనాలు మాట్లాడుకుంటూనే ఉంటారు.  ఈ కాన్సెప్ట్ తో అసలు ఏం జరిగింది..?  అన్న విషయం జనాలకు తెలియజేసే దానికోసం చాలామంది ప్రత్యూష బయోపిక్ తెరకెక్కించాలి అని ఆశపడ్డారు.



కానీ కొందరు పొలిటికల్ పరంగా కొంతమంది ఇందులో ఇరుక్కున్నారు అని తెలిసి వెనకడుగు వేశారు.  కాగా ఇప్పుడు మాత్రం స్టార్ డైరెక్టర్ అందుకు  రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది . అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నా ను చూస్ చేసుకున్నారట , ప్రత్యూష పోలికలతో రష్మిక మందన్నా ఉంటుంది అని ఆమె ఈ రోల్ కి బాగా సూట్ అవుతుంది అని ఆమెను అప్రోచ్ అయ్యి కథ వినిపించుగా ఓకే చెప్పేసిందట.  దీంతో కాంట్రవర్షియల్ సబ్జెక్టుకి రష్మిక మందన్నా  సైన్ చేసింది అన్న వార్త ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: