తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. ఇక ఈశ్వర్ మూవీ తో కెరీర్ ను మొదలు పెట్టిన ప్రభాస్ మొదటి మూవీ తోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అనేక విజయాలను అందుకుంటూ ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇంత గొప్ప క్రేజ్ కలిగిన హీరో సినిమాలో హీరోయిన్గా అవకాశం వస్తే ఎవరూ వద్దనుకోరు. అలాగే సినిమా స్టార్ట్ అయిన తర్వాత కూడా అలాంటి హీరో సినిమా నుండి బయటకు వద్దామని కూడా చాలా వరకు ఎవరు అనుకోరు.

కపోతే ప్రభాస్ హీరో గా రూపొందిన వర్షం సినిమా విషయంలో మాత్రం స్టార్ హీరోయిన్ త్రిషసినిమా నుండి తప్పుకుందాం అని అనుకుందట. అసలు విషయం లోకి వెళితే ... ప్రభాస్ కొన్ని సంవత్సరాల క్రితం వర్షం అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ద్వారానే త్రిష కి అద్భుతమైన గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా త్రిష అమ్మ గారు మాట్లాడుతూ ... వర్షం సినిమా ద్వారా త్రిష కు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది.

కానీ వర్షం సినిమా జరుగుతున్న సమయంలో ఆ సినిమానే వద్ద అనుకున్నాం. ఎందుకు అంటే ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అనేక రోజుల పాటు వర్షం లో షూటింగ్ను పెట్టారు. దానితో త్రిష కు అనేక హెల్త్ సమస్యలు వచ్చాయి. దానితో ఆ సినిమానే వద్దు వదిలేసి వెళ్లిపోదాం అనుకున్నాం. కానీ ఆ సినిమా విడుదల అయ్యి బ్లాక్ బాస్టర్ విజయం కావడంతో త్రిష కు అద్భుతమైన గుర్తింపు వచ్చింది. దానితో త్రిష కు వచ్చిన హెల్త్ సమస్యల గురించి కూడా మేము పట్టించుకోలేదు అని త్రిష అమ్మ గారు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: