టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు ఉన్న విషయం తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి దర్శకత్వంతో సినిమాని ఓ రేంజ్ కి తీసుకెళ్తారు. అలాంటి వారిలో దర్శకుడు రాజమౌళి ఒకరు. సినీ పరిశ్రమలో రాజమౌళి తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. రాజమౌళి తీసే సినిమాలకు చాలా సమయం పట్టినప్పటికీ మంచి స్టోరీతో అభిమానుల ముందుకు వస్తూనే ఉంటారు. తన చేతిలోకి వచ్చిన ఏ హీరో అయినా సరే అతను పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదగడం తప్పనిసరి.


రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రతి ఒక్క సినిమా మంచి విజయాలను అందుకుంటాయి. అదే స్థాయిలో హీరో కూడా మంచి సక్సెస్ సాధిస్తాడు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ 29 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాను ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించబోతోంది. అంతేకాకుండా హాలీవుడ్ మోస్ట్ ఫేమస్ యాక్టర్స్ కూడా ఈ సినిమాలో నటించబోతున్నారు.


కాగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ బయటకు వచ్చింది. ఎస్ఎస్ఎంబీ 29 సినిమా షూటింగ్ సమయంలో అక్కడికి వచ్చే నటీమణులు, టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరూ షూటింగ్ స్పాట్ లోకి ప్లాస్టిక్ బాటిల్స్ అసలు తీసుకుని రాకూడదట. మహేష్ బాబుతో సహా ప్రతి ఒక్కరికి జక్కన్న ఈ కండిషన్ పెట్టారట. 1000 మందికి పైగా వ్యక్తులతో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఎక్కడా కూడా ఎవరు ప్లాస్టిక్ బాటిల్స్ అస్సలు వాడకూడదని నిర్ణయం తీసుకున్నారు. కేవలం గాజు సీసాలను మాత్రమే వాడాలని జక్కన్న సూచనలు చేశారట.

అత్యవసర పరిస్థితులలో మాత్రమే ప్లాస్టిక్ వస్తువులను వాడాలని చెప్పారట. ఈ విషయం కీరవాణి సతీమణి వల్లి ఇచ్చిన ఐడియా ప్రకారం ఈ నిర్ణయాన్ని జక్కన్న తీసుకున్నారట. దీనివల్ల పర్యావరణ పరిరక్షణకు తమ వంతుగా కొంచమైన సహాయం చేసినట్లు అవుతుందని ఈ నిర్ణయాన్ని తీసుకున్నారట. ఇక దీనిని ప్రతి ఒక్కరు తప్పకుండా పాటించాలని చెప్పినట్టుగా సమాచారం అందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: