
అంతేకాదు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రెండవ సారి తండ్రి కావడంపై ఆయన ఆడపిల్లలను చులకనగా చేసి మాట్లాడాడు అనే భావన కూడా అందరికీ కలిగింది. మరొకసారి ఆడపిల్ల పుట్టేస్తుందేమో అన్న భయం అంటూ చెప్పడం నిజంగానే చిరంజీవి పై ఉన్న ఇంప్రెషన్ ని పాడు చేసింది . అయితే మెగా అభిమానులు కొంతమంది చిరంజీవి మాట్లాడింది తప్పే అంటుంటే మరి కొంతమంది మాత్రం ఆయన లైఫ్ ఆయన ఇష్టం అంటూ చిరంజీవికి సపోర్ట్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ పై మాత్రం చిరంజీవి తన సైలెంట్ రియాక్షన్ ముందుకు తీసుకెళ్తున్నారు.
ఎక్కడా కూడా తాను చేసింది తప్పు అని లేదా ఒప్పు అని సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ పై ఏ విధంగా స్పందించకుండా తన పని తాను చూసుకుంటున్నాడు . కానీ అటువంటి ట్రోలింగ్ జరుగుతున్నప్పుడు మాత్రం మెగా ఫాన్స్ మెగాస్టార్ కి అండగా "బుద్ధిలేని వెధవలు ఎన్నిసార్లు ట్రోల్ చేస్తారో చేసుకొనివ్వండి" అంటూ అలా ట్రోల్ చేసే వాళ్ళకి ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు . మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి సైలెంట్ గా ఉండిపోయాడు. ఆయన తప్పు చేశాడు అన్న కారణంగానా..? లేకపోతే తప్పు చేయలేదు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటే నాకేం అన్న కారణంగానా..? ఏమో ఆయనకే తెలియాలి అంటూ మరి కొంతమంది చేతులు దులిపేసుకుంటున్నారు..!