టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని ఇప్పటికి కూడా మంచి గుర్తింపును కలిగిన హీరోగా తెలుగు సినీ పరిశ్రమలో కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలో అద్భుతమైన స్థాయికి చేరుకున్న నటి మణులలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈమె అనేక సంవత్సరాలు పాటు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించింది.

ఇప్పటికి కూడా ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటిగా కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే నాగార్జున , కాజల్ అగర్వాల్ కాంబోలో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ వీరి కాంబినేషన్లో ఓ రెండు సినిమాలు మిస్ అయినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... కొన్ని సంవత్సరాల క్రితం నాగార్జున "రగడ" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అనుష్క , ప్రియమణి హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ లో ప్రియమణి పాత్రకు మొదట కాజాల్ నే అనుకున్నారట.

కానీ కొన్ని కారణాల వల్ల చివరి నిమిషంలో కాజల్ ను కాకుండా ఈ మూవీ బృందం ప్రియమణి ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నాగార్జున కొంత కాలం క్రితం ది ఘోస్ట్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్ , నాగార్జున కు జోడిగా నటించింది. ఈ మూవీ లో కూడా కాజల్ ను హీరోయిన్గా అనుకున్నారట.  కానీ కొన్ని కారణాల వల్ల చివరి నిమిషంలో ఈ మూవీ లో సోనాల్ చౌహాన్ ను హీరోయిన్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అలా నాగార్జున , కాజల్ కాంబోలో ఈ రెండు సినిమాలు మిస్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: