సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు , డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ కాలం కెరియర్ను కొనసాగించడం కష్టం అని వాదనను చాలా మంది వినిపిస్తూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం సినిమా ఇండస్ట్రీలో అత్యంత డేంజర్ జోన్ లో ఉండేది నిర్మాతలు , డిస్ట్రిబ్యూటర్లు అని , ఏదైనా రెండు , మూడు సినిమాల ద్వారా వారికి పెద్ద మొత్తంలో నష్టాలు వచ్చినట్లయితే మరో సినిమాను నిర్మించలేరు , అలాగే డిస్ట్రిబ్యూట్ చేయలేరు. అందుకే అతి తక్కువ మంది మాత్రమే సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలుగా , డిస్ట్రిబ్యూటర్ లుగా చాలా కాలం కొనసాగుతారు అనే వాదనను చాలా మంది వినిపిస్తూ ఉంటారు. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో చాలా సంవత్సరాలుగా నిర్మాతగా , డిస్ట్రిబ్యూటర్ గా అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న వారిలో దిల్ రాజు ఒకరు.

ఇకపోతే దిల్ రాజుకు కూడా డిస్ట్రిబ్యూషన్ రంగంలో భారీ ఎదురు దెబ్బలు తగిలిన సందర్భాలు అనేకం ఉన్నట్లు ఆయనే అనేక ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. ఇక 2017 వ సంవత్సరం ఆయనకు డిస్ట్రిబ్యూటర్ గా భారీ ఎదురు దెబ్బ తగిలినట్లు ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు చెప్పుకొచ్చాడు. అలాగే ఆ నష్టాల నుండి ఎలా కోలుకున్నాను అనే విషయాన్ని కూడా ఆయన వివరించాడు. తాజాగా దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... నేను 2017 వ సంవత్సరం అనేక సినిమాలను నిర్మించాను. అలాగే కొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా కూడా చేశాను. ఇక 2017 వ సంవత్సరం నేను పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన అజ్ఞాతవాసి , మహేష్ బాబు హీరో గా రూపొందిన స్పైడర్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశాను.

ఆ సినిమాల ద్వారా నాకు 25 కోట్ల నష్టం వచ్చింది. నేను కేవలం డిస్ట్రిబ్యూటర్ అయి ఉంటే అప్పుడే నా కెరియర్ క్లోజ్ అయ్యేది. కానీ నేను నిర్మించిన చాలా సినిమాలు 2017 వ సంవత్సరం విడుదల అయ్యాయి. అందులో చాలా మూవీలు అద్భుతమైన విజయాలను అందుకొని భారీ మొత్తంలో నాకు లాభాలను తీసుకువచ్చాయి. దానితో నిర్మాతగా నాకు వచ్చిన లాభాలు , డిస్ట్రిబ్యూటర్ గా నాకు వచ్చిన నష్టాలను పూడ్చాయి. అందుకే నేను సక్సెస్ ఫుల్ గా ఇప్పటికి కెరియర్ను కొనసాగిస్తున్నాను అని ఆయన ఒక ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: