పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక క్రేజ్ ఉన్న హీరో.. ఈయనకి అమ్మాయిలు అంటే చాలా గౌరవం. అంతేకాదు తనతో పని చేసే హీరోయిన్ లను కూడా చాలా గౌరవంగా చూస్తారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన ఎంతోమంది హీరోయిన్లు ఆయనతో సినిమా చేసే సమయంలో ఎదురైనా ఎన్నో మంచి మంచి అనుభవాలను పంచుకుంటారు. అంతే కాదు పవన్ కళ్యాణ్ చాలా గొప్ప మనస్వత్వంతో మెదులుతారు అని గొప్పగా మాట్లాడుతుంటారు.అయితే అలాంటి అమ్మాయిలను గౌరవించే పవన్ కళ్యాణ్ అప్పట్లో ఓ హీరోయిన్ ని కొట్టారంటూ ఒక రూమర్ వినిపించింది.ఇక ఆ హీరోయిన్ ఎవరంటే పవన్ కళ్యాణ్,భూమిక కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఖుషి మూవీ వచ్చిన సంగతి మనకు తెలిసిందే. 

సినిమా అప్పట్లో యూత్ కి ఒక ట్రెండ్ సెట్టర్ మూవీ అని చెప్పుకోవచ్చు. అప్పట్లో యూత్ అంతా పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి మూవీ చూసి ఫిదా అయిపోయారు. అలా బ్లాక్ బస్టర్ ఖుషి సినిమా షూటింగ్ సమయంలో హీరోయిన్ భూమిక ని పవన్ కళ్యాణ్ కొట్టారంటూ అప్పట్లో కొన్ని వదంతులు వినిపించాయి. ఈ విషయం తెలిసి ఇలియానా కూడా పవన్ కళ్యాణ్ తో నెక్స్ట్ సినిమా అంటే నేను చేయను బాబోయ్ అని రిజెక్ట్ చేసినట్టు వార్తలు వినిపించాయి.

పవన్ కళ్యాణ్ ని భూమిక కొట్టడం వల్లే ఇలియానా కూడా భయపడి పవన్ తో నెక్స్ట్ సినిమా చేయడానికి నో చెప్పింది అనే రూమర్లు ఫిలింనగర్ లో వినిపించాయి. దాంతో పవన్ కళ్యాణ్ హీరోయిన్ పై చేయి చేసుకున్నారు అనే రూమర్ పెద్ద ఎత్తున వైరల్ అయింది. కానీ ఈ విషయంలో ఎలాంటి నిజం లేదు అని కొంతమంది పవన్ గురించి తెలిసిన సన్నిహితులు అంటుంటారు.అదంతా ఎవరో కావాలనే పవన్ కళ్యాణ్ పై చేసిన దుష్ప్రచారం అని కొట్టిపారేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: