
నిజానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా ఉంటుంది అంటూ ప్రకటన వచ్చింది. కానీ కొన్ని కారణాల చేత అది ఆగిపోయినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఆ బాధ్యతలను స్టార్ట్ డైరెక్టర్ నాగ్ అశ్వీన్ చేతిలోకి పెట్టాడు బాలకృష్ణ అంటూ జనాలు మాట్లాడుకున్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు నాగర్జున కూడా మోక్షజ్ఞ సినిమా విషయంలో హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాను న్యూస్ ప్రకారం .."నాగ్ అశ్విన్ ప్రెసెంట్ అలియా భట్ తో ఒక సినిమా కోసం చర్చలు జరుపుతున్నారట . ఈ సినిమా ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయినట్టే . అంతే కాదు ఈ సినిమా అయిపోయిన వెంటనే కల్కి 2ను కూడా సెట్స్ పై కి తీసుకో రాబోతున్నారట . ఈ రెండు సినిమాలు కంప్లీట్ అవ్వాలంటే దాదాపు మూడేళ్లు పడుతుంది. అయితే మూడేళ్ల వరకు మోక్షజ్ఞ సినిమా ఆపాలి అంటే కచ్చితంగా అది సాధ్యమయ్యే పని కాదు . అందుకే బాలకృష్ణకు నో అని చెప్పకనే ఇలా ఎసరు పెడుతున్నాడు నాగ్ అశ్వీన్" అంటున్నారు జనాలు. దీంతో నాగ్ అశ్వీన్ కూడా మోక్షజ్ఞను డెబ్యూ చేయలేడు అని ..ఇక ఆ బాధ్యతలను ఎవరికిస్తాడో బాలయ్య అంటూ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ . చూద్దాం ఏం జరుగుతుందో..???