
మేకర్స్ కూడా దీనిపై ఎలాంటి అనౌన్స్ చేయడం లేదు . ఇక ఈ సినిమాలో బాలకృష్ణ ను ఎంతో కొత్తగా చూపించారు దర్శకుడు బాబి .. ముఖ్యంగా బాలయ్య మేనరిజం ఆయన ఎనర్జీ అభిమానులను ఎంతగానో ఫిదా చేశాయి . అలాగే సంక్రాంతికి బాలయ్య సినిమా వస్తుందంటే అది బ్లాక్ బస్టర్ హిట్ అనే టాక్ ఎప్పటినుంచో ఉంది. వీటికి తోడు అఖండ సినిమా తర్వాత నుంచి బాలయ్య ఏ సినిమా చేసిన అది బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధిస్తూనే ఉంది .. ఇప్పుడు డాకు మహారాజ్ కూడా సూపర్ హిట్గా నిలిచింది . ముఖ్యంగా తమన్ అందించిన మ్యూజిక్ మరో లెవల్ లో ఉందని చెప్పాలి . రీసెంట్ గానే బాలకృష్ణ కూడా తమనన్ కు భారీ గిఫ్ట్ కూడా ఇచ్చాడు . రెండు కోట్ల ఖరీదు చేసే భారీ కారును తమన్ కు బాలయ్య గిఫ్ట్ గా ఇచ్చాడు . 2024లో జరిగిన ఎన్నికల్లో హిందూపూర్ ఎమ్మెల్యేగా హాట్రిక్ విజయం సాధించారు బాలయ్య.
ఇక రీసెంట్ గానే బాలయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును కూడా ప్రకటించింది .. ఈ టైంలో వచ్చిన డాకు మహారాజ్ సినిమా బాలయ్యను మరో లెవల్కు తీసుకుపోయింది.. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు కానీ తాజాగా దీనిపై అనౌన్స్మెంట్ చేసింది .. దాదాపు 90 కోట్ల పెట్టి ఈ సినిమాను కొన్నట్టు తెలుస్తుంది .. ఇక ఎక్కువ లేట్ చేయకుండా ఈ సినిమాను ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది .. ఈ సినిమా రీలోడెడ్ వర్షన్ రిలీజ్ చేసే అవకాశం కూడా ఉందని ప్రచారం జరుగుతుంది .. ఇప్పటికే ఈ మూవీ రీలోడెడ్ వర్షన్ పై ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది . దర్శకుడు బాబి మరికొన్ని పవర్ఫుల్ సీన్స్ రీలోడేడ్ వెర్షన్ లో యాడ్ చేసినట్టు తెలుస్తుంది . మరీ ముఖ్యంగా డాకు మహారాజ్ గా మారినప్పటి నుంచి మరికొన్ని సన్నివేశాలను ఆడ్ చేశారట .. దాదాపు 15 నుంచి 20 నిమిషాలు ఈ సినిమా రన్ టైం మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు . బాలయ్య డాకు మహారాజ్ 250 కోట్ల వరకు కలెక్షన్ రాబెట్టాడు.