పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటం తో తన సినిమాలకు టైం ఇవ్వలేకపోతున్నాడు .. ఇప్పుడు వచ్చే నెలలో పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు ప్రేక్షకులు ముందుకు రావడానికి రెడీగా ఉంది .. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కొత్త షూటింగ్ షెడ్యూల్ అలా మొదలైందో లేదో ఆయన అనారోగ్యానికి గురయ్యారు .. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని లైస్పాండిలైసిస్‌ సమస్యతో కూడా ఇబ్బంది పడుతున్నారని ప్రకటన వచ్చింది.


ఈ ప్రకటన వచ్చిన కొన్ని రోజులకే పవన్ లేచి కూర్చున్నారు .. ఇప్పుడు ఏకంగా షష్ఠ షణ్ముఖ క్షేత్ర యాత్రను కంప్లీట్ చేశారు .. చ‌క‌చ‌క నడుస్తూ దేవాలయాల్ని చుట్టేస్తున్నారు .. అవి పూర్తయిన వెంటనే అటు నుంచి ఆటు మ్యూజికల్ నైట్ చారిటీ షోకు కూడా హాజరయ్యారు . ఇలా అన్నీ చకచక జరిగిపోయాయి .. ఇప్పుడేంటి ఇకనైనా పవన్ షూటింగ్లకు వెళతారా ? అయితే ఇప్పుడు గతంలో కంటే పెద్ద అడ్డంకి వచ్చి పడింది .. ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఈనెల 24 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి .. ఇవి మొదలైతే డిప్యూటీ సీఎం హోదాలో ఆయన కచ్చితంగా సమావేశాలకు వెళ్లాల్సి ఉంటుంది .. ఒకవైపు సమావేశాలు జరుగుతుండగా మరోవైపు షూటింగ్ చేస్తే కచ్చితంగా రాజకీయ విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది .


కాబట్టి అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే లోపు ఈ నాలుగైదు రోజుల్లో పవన్ హరిహర వీరమల్లు షూటింగ్లో కి అడుగు పెట్టాలి .. లేదంటే తిరిగి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మాత్రమే  ఈ షూటింగ్ కు వెళ్లే అవకాశం ఉంటుంది .. ఈ విధంగా చూసుకుంటే మార్చ్ 28 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం అనుమానమే అని కూడా అంటున్నారు . మరి పవన్ తన అభిమానుల ఆవేదనను అర్థం సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తిచేసి వీరమల్లు ను ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తారా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: